దోసకాయ మటన్ కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ వదిలిపెట్టరు..!
మటన్ అనగానే చాలా మందికి నోరూరూతుంది. చికెన్ తో పోలిస్తే కాస్త రేటు ఎక్కువైనా పర్లేదు కానీ మటన్ తినాల్సిందేనని అంటారు చాలా మంది నాన్ వెజ్ లవర్స్. అయితే రొటీన్ గా మటన్ కర్రీ వండుకోవడంలో మజా ఏముంటుంది..? అందుకే ఎప్పుడు ఒకేలా కాకుండా దోసకాయ మటన్ కర్రీ తయారీ చేసుకోండి. సూపర్ టేస్టీతోపాటు ఈజీగా జీర్ణం అవుతుంది. ఇదే ఈ కర్రీ ప్రత్యేకత.. మరి సూపర్ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం.. పూర్తి వివరాలు మీకోసం..
దోసకాయ మటన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. దోసకాయలు రెండు, పచ్చి మిర్చి ఎనిమిది లేదా పది, ఉల్లిపాయలు నాలుగు, ఒక కేజీ మటన్,అర చెంచా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ లు, కారం రుచికి సరిపడా, ఉప్పు తగినంత, గరం మసాలా ఒక స్పూన్, నూనె తగినంత తీసుకోవాలి.
ఇక దోసకాయ మటన్ కర్రీ తయారీ విధానం.. ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకూ మగ్గించుకోవాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమంలో పసుపు వేసి కలుపుకోవాలి. అలా ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసి కలపాలి. ఆ తర్వాత అందులో కారం, ఉప్పు వేసి రెండు గ్లాసుల నీటిని పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మటన్ బాగా ఉడికేవరకు మగ్గించుకోవాలి. మటన్ ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకుని కలిపి రెండు నిమిషాల పాటు ఉంచి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సూపర్ టేస్టీ దోసకాయ మటన్ కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications