గరం గరం అల్లం- క్యారెట్ సూప్: దెబ్బకు గొంతు ఇబ్బందులు పరార్: తయారీ ఇలా

రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. ఇది జలుబు, జ్వరం వంటి వాటికి ఓ చక్కటి హోమ్ రెమెడీ. శ్వాసనాళ ఇన్ఫెక్షన్ల తగ్గడంలో అల్లం సహాయపడుతుంది. అలాగే దగ్గు, గొంతు నొప్పి, బ్రోన్కైటిస్‌ వంటి సమస్యలకు కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. అద్భుతమైన ఆయుర్వేద గుణాలున్న అల్లాన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం.

నిజానికి భారతీయ వంటకాలలో సూప్ సంప్రదాయం లేకపోయినా, ఇటీవల కాలంలో దీనికి చాలా మంది అలవాటు పడ్డారు. సాధారణంగా భోజనానికి ముందు సూప్ తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. క్యారెట్, అల్లం కలిపిన ఈ సూప్ తీసుకోవడం వల్ల రుచికి రుచితో పాటు గొంతుకు సంబంధించిన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ సూప్‌లో అల్లం చేర్చితే రుచి మరింత పెరుగుతుంది. అల్లం, క్యారెట్ కలయిక చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

మంచి రంగు రావడానికి తాజా క్యారెట్లను వాడాలి. గాజర్ కా హల్వాకు ఉపయోగించే ఎర్ర క్యారెట్లు కూడా వాడవచ్చు. సూప్ మరీ పల్చగా లేదా మరీ చిక్కగా ఉండకూడదు. మధ్యస్థంగా ఉండాలి. సూప్ ఎప్పుడూ వేడిగా సర్వ్ చేయాలి.

ఈ క్యారెట్ జింజర్ సూప్ తయారీ విధానం

ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో అల్లం ముక్కలను వేయించాలి. తరువాత అర ఉల్లిపాయను వేసి మెత్తగా అయ్యే వరకు వేయించాలి. తర్వాత మూడు క్యారెట్లను వేసి రెండు నిమిషాల పాటు మళ్లీ వేయించాలి.

ఆ తర్వాత అందులో అల్లం ముక్కలను వేసి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత రెండున్నర కప్పుల నీరు, అర టీస్పూన్ ఉప్పు వేసి, మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఆవిరిపోయిన తర్వాత చల్లార్చి, బ్లెండర్‌లో వేసి మెత్తని గుజ్జులా చేయాలి.

ఈ గుజ్జును ఒక పెద్ద కడాయిలోకి తీసుకుని, క్యారెట్ ఉడికించడానికి మిగిలిన నీటిని కలపాలి. అవసరమైన సూప్ చిక్కగా వచ్చేంత వరకు మరిగించాలి. తర్వాత అర టీస్పూన్ మిక్స్‌డ్ హెర్బ్స్, అర టీస్పూన్ మిరియాల పొడి, పావు టీస్పూన్ ఉప్పు కలపాలి. చివరగా, క్యారెట్ జింజర్ సూప్‌ను రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలు, ఒక టీస్పూన్ పుదీనాతో అలంకరించి సర్వ్ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+