షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!!
ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వృద్ధులే కాదు యువత కూడా డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిక్ రోగులు వేసవి కాలంలో ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి కొంతమంది తేలికపాటి ఆహారం లేదా ద్రవ ఆహారాన్ని తీసుకుంటారు. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో షుగర్ పేషెంట్లు ఎండాకాలంలో ఎలాంటి స్నాక్స్ తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో సర్వసాధరమైన వ్యాధిగా మారింది. ఒక్ కసారి డయాబెటిస్ బారిన పడితే దాని నుంచి పూర్తిగా బయటపడటం అసాధ్యం. ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు , వ్యాయామం లాంటి జాగ్రత్తలతో వ్యాధిని అదుపులో పెట్టుకోవడం ఒక్కటే మార్గం. స్నాక్స్ విషయంలోనూ తినాల్సినవి, తినకూడనివి తెలుసుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. షుగర్ పేషెంట్లు వేసవిలో సులువుగా జీర్ణమయ్యే స్నాక్స్ తీసుకోవడం మంచిది. మొలకెత్తిన గింజలతో పెరుగును కలిపి సలాడ్ చేసుకొని తినడంవల్ల తేలికగా జీర్ణమవుతుంది. ఎందుకంటే మొలకెత్తిన గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. పెసరపప్పు కూడా షుగర్ పేషెంట్లకు వేసవిలో మంచి ఆహారం. ఎందుకంటే పెసర పప్పులో ప్రోటీన్‌లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి.

వేసవిలో జాగ్రత్తలు అవసరం
అందుకే పెసరపప్పు తినడంవల్ల డయాబెటిస్‌తోపాటు కడుపులో మంట కూడా తగ్గుతుంది. పెసరపప్పుతో పెరుగును కలుపుకుని పలు వెరైటీల్లో స్నాక్స్ చేసుకుని తినొచ్చు.ఈ స్నాక్స్‌తోపాటు నిమ్మరసం, సల్ల, బత్తాయి పండ్లు, పుచ్చపండ్లు లాంటి నీరు ఎక్కువగా పండ్లను, పానీయాలను తరచూ తీసుకుంటే శరీరంగా కూల్ ఉండి, ఒంట్లో చక్కెర స్థాయిలో హెచ్చతగ్గులకు లోనుకాకుం డా అదుపులో ఉంటాయి. దోసకాయ ముక్కలను సలాడ్‌గా తీసుకోవడంవల్ల వేసవిలో వేడిగా ఉన్న శరీరం చల్లబడుతుంది. అలాగే దాహం కూడా తీరుతుంది. ఎందుకంటే దోసలో అధిక శాతం నీరే ఉంటుంది. అంతేగాక పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇలా డయాబెటిక్ బాధితులు ప్రతీ రోజూ తమ డైట్ ను వేసవిలో ప్లాన్ చేసుకోవటం ద్వారా ఎండ తీవ్రత నుంచి బయట పడటంతో పాటుగా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications