చికెన్ తిన్న తర్వాత ఇవి అసలే తినొద్దు!
చాలామంది చికెన్ ను ఇష్టంగా తింటారు. ఇక విపరీతంగా ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ తినే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే కోడి మాంసాన్ని ఒక పట్టు పట్టాల్సిందే అటువంటివారు చికెన్ తో పాటు తినకూడని కొన్ని ఆహారాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
చికెన్ తో ఇవి తీసుకోకండి
చికెన్ లేదా నాన్ వెజ్ ఏదైనా తిన్న తర్వాత పొరపాటున కూడా పాలు తాగకూడదు. పాలు చికెను కలిపి తీసుకుంటే శరీరంలో టాక్సిన్స్ ఏర్పడి మన జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, మలబద్ధకం, చర్మ సమస్యలు కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

చికెన్ తో పెరుగు తింటున్నారా?
చాలామంది చికెన్ తో పాటు పెరుగును కలుపుకొని తింటూ ఉంటారు. పొరపాటున కూడా చికెన్ తో పెరుగు తినకూడదు . ఇలా చేసిన జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక బిర్యానీలో కూడా పెరుగు కలుపుకుని తినేవారు చాలామంది ఉన్నారు. చికెన్ తో పాటు బిర్యానీలో పెరుగు కలుపుకుని తింటే ఆ తర్వాత జీర్ణం కాక ఇబ్బంది పడాల్సి వస్తుంది.
పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారా?
చికెన్ తిన్న తర్వాత చాలామంది పండ్లరసాలను, కూల్ డ్రింక్స్ ను తాగుతారు. అయితే అది ఏమాత్రం మంచిది కాదు. చికెన్ తిన్న తర్వాత పండ్ల రసాలు తాగడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే చికెన్ తర్వాత పండ్ల రసాల జోలికి, కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది.
చికెన్ తిన్నాక ఆలు గడ్డలు తింటున్నారా ?
చాలామంది చికెన్ తిన్న తర్వాత తెలిసో తెలియకో బంగాళదుంపలను తింటే కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. చికెన్ తిన్న తర్వాత ఆలుగడ్డలను పొరపాటున కూడా తినకూడదు. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. చికెన్ తిన్న తర్వాత బంగాళదుంప తింటే అజీర్తి సమస్యలు వస్తాయి.
చికెన్ తిన్నాక తేనే తీసుకుంటున్నారా?
ఇక చికెన్ తిన్న తర్వాత తేనె తీసుకోవడం కూడా మంచిది కాదు చికెన్ తిన్నాక తేనె తీసుకుంటే కూడా అది జీర్ణ వ్యవస్థను దెబ్బ తీస్తుంది.చికెన్ తో పాటు తేనె తీసుకోవటం ఏ మాత్రం మంచిది కాదు. చికెన్ తినేవాళ్ళు మరీ అతిగా చికెన్ తిన్నా డేంజర్.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications