వెయిట్ లాస్ కోసం వీళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అసలే చెయ్యొద్దు.. చేస్తే ప్రమాదం!

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న డైట్ విధానం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఒక సమయం ప్రకారం భోజనం చేసి, ఆ తర్వాత కొన్ని గంటలపాటు కడుపును ఖాళీగా ఉంచి తద్వారా బరువు తగ్గే డైటింగ్ విధానం. ఈ విధానాన్ని మనదేశంలో చాలా మంది అనుసరిస్తున్నారు. అయితే, ఇది అందరికీ సరిపోకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీరికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మంచిది కాదు

ప్రముఖ పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు లేదా గర్భిణీ స్త్రీలు ఈ పద్ధతిని పాటించకూడదు. ముఖ్యంగా, మధుమేహం లేదా ఆహార రుగ్మతలతో బాధపడేవారికి ఇది అస్సలు సరిపోదు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రంగా తగ్గిపోవచ్చు. దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు.

Don t do Intermittent Fasting with these health issues it s dangerous

Take a Poll

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తో ఈ సమస్యలు

అలాగే, ఆహారపు అలవాట్లలో లోపాలు (eating disorders) ఉన్నవారికి, ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించడం వల్ల వారి సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యకరంగా పెరగడానికి పోషకాహారం అవసరం. కాబట్టి, వారు ఈ ఫాస్టింగ్ అస్సలు చేయకూడదు. అంతేకాదు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది.

థైరాయిడ్ సమస్యలు ఉన్నాయా? అయితే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వద్దు

ప్రత్యేకించి, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇది అసలు మంచిది కాదు. ఇది వారికి చాలా ఆందోళనకరమైన విషయం. ఈ పద్ధతి వల్ల శరీరజీవక్రియ మందగించి, శక్తి స్థాయిలు పడిపోవడమే కాకుండా, మొత్తం ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. ఎవరైనా సరే ఏదైనా డైట్ పద్ధతిని ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. దీనివల్ల మీ ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తలెత్తే అనర్థాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయలేని వారికి ప్రత్యామ్నాయం ఇదే

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయలేని వారు కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించవచ్చు. సమతుల ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల వచ్చే ప్రమాదాలు లేకుండానే బరువు తగ్గవచ్చు. మొత్తంగా చెప్పాలంటే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కొందరికి మేలు చేయవచ్చు. అయితే, దీన్ని ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా అంచనా వేసుకోవడం చాలా అవసరం. ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ద్వారా మన శరీరానికి తగ్గట్టు సరైన డైటింగ్ విధానాన్ని ఎంచుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+