డయాబెటిస్ ఉన్నవారు కోడిగుడ్లను తినవచ్చా..? వీరికి డేంజర్..!!
కోడిగుడ్డు. వీటిల్లో శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. అందుకనే గుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ ఉన్నవారు గుడ్లను తినవచ్చా..? కోడిగుడ్లను ఎంత మోతాదులో తినాలి..? వంటి విషయాలపై సందేహాలు వస్తుంటాయి. అయితే, డయాబెటిస్ ఉన్నవారు కోడిగుడ్లను తీసుకొనే విషయంలో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. అదే సమయంలో తీసుకోవాల్సిన పరిమితి ..ఎవరు తీసుకుంటే సమస్యలు వస్తాయో వివరిస్తున్నారు.
డయాబెటిస్ ఉన్నప్పటికీ కోడిగుడ్లను తినవచ్చు. కానీ మోతాదులోనే తినాలి. కోడిగుడ్డులో ఉండే పచ్చ సొన తీసేని తినాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. లేదంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడి.. షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు కోడిగుడ్లను తినే విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ఏడీఏ) చెబుతున్న ప్రకారం ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు 2 గుడ్లను తినవచ్చు. లేదా వారంలో 7 నుంచి 12 గుడ్ల వరకు తినవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు మాత్రం రోజూ ఒక గుడ్డును తిన్నా అందులోని పచ్చ సొనను తీసి తినాల్సి ఉంటుంది.
కోడగుడ్లలో హై క్వాలిటీ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అనేక విటమిన్లు, మినరల్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి.

ఇక గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు కోడిగుడ్లను తినకపోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గుండె సమస్యలు ఉన్నవారు గుడ్లను తినకూడదు, లేదా డాక్టర్ సూచన మేరకు తినాల్సి ఉంటుంది. అలర్జీలు ఉన్నవారికి కొన్ని రకాల ఆహారాలు పడవు. సోయా అలర్జీలు ఉన్నవారికి కోడిగుడ్లు పడవు. కనుక అలాంటి వారు కూడా కోడిగుడ్లను తినకడూదు. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నవారు కూడా గుడ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. కోడిగుడ్డును తినడం వల్ల మనకు 72 క్యాలరీల శక్తి లభిస్తుంది. 6 గ్రాముల ప్రోటీన్లు, 5 గ్రాముల కొవ్వులు, 186 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయి. అలాగే విటమిన్ బి12, డి, బి2, సెలీనియం, కోలిన్ వంటి పోషకాలు గుడ్లలో అధికంగా ఉంటాయి. ఆరోగ్యవంతులు అయినా సరే కోడిగుడ్లను మోతాదులోనే తినాలి. అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. దీంతో.. కోడిగుడ్లను తినేవారు పరిమితి మేరకు తీసుకుంటే సమస్యలు ఉండవని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications