షుగర్ కంట్రోల్ లో లేకుంటే వెంటనే ఇలా చెయ్యండి!

డయాబెటిస్ ప్రస్తుతం అధికంగా పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధి. మధుమేహం బారిన పడినవారు జీవనశైలిని మార్చుకొని క్రమం తప్పకుండా మందులను వాడి రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి డయాబెటిస్ బాధితులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మధుమేహం విపరీతంగా పెరిగిపోతుంది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు డేంజర్ బెల్స్ మోగిస్తాయి.

కంట్రోల్ చెయ్యలేని స్థితికి డయాబెటిస్.. ఏం చెయ్యాలంటే

షుగర్ విపరీతంగా పెరిగినప్పుడు, కంట్రోల్ చెయ్యలేని స్థితికి చేరుకున్నప్పుడు డయాబెటిస్ బాధితులు ఏం చేయాలి? ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్న వ్యక్తుల కోసం రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం అత్యంత ముఖ్యమైనది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి తీసుకునే కొన్ని చర్యలు తీవ్రమైన సమస్యలను నివారించడానికి ఎంతో అవసరం.

Emergency Steps To Manage High Blood Sugar Levels In Diabetes Care

ఈ లక్షణాలతో డయాబెటిస్ కంట్రోల్ లో లేదని గుర్తింపు

అటువంటి వాటిలో ముఖ్యమైనవి ముందుగా మన డయాబెటిస్ కంట్రోల్ లో లేదు అనే విషయాన్ని శరీరంలో కనిపించే లక్షణాల ఆధారంగా గుర్తించటం. సాధారణంగా డయాబెటిస్ పెరిగితే విపరీతమైన దాహం, తరచుగా మూత్ర విసర్జన, అలసట, మసక బారిన చూపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించాయంటే షుగర్ కంట్రోల్లో లేదు అనే విషయాన్ని గుర్తించాలి.

షుగర్ టెస్ట్ తో పాటు ఇలా చెయ్యాలి

ఇటువంటి సమయంలో వెంటనే గ్లూకోజ్ స్థాయిలను గ్లూకోమీటర్ తో టెస్ట్ చేసుకొని రక్తంలో షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో పరిశీలించాలి. విపరీతంగా షుగర్ లెవల్స్ ఉంటే ఆందోళన చెందకుండా కాస్త ఎక్కువ మోతాదులో నీరు తాగాలి. దీనివల్ల శరీరంలో అదనంగా ఉన్న చక్కెర మూత్రం ద్వారా బయటకు పంపడం జరుగుతుంది.

ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి

ఇక విపరీతంగా షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు బయట చక్కెర పదార్థాలను, తీపి పానీయాలను తాగకూడదు. వేసుకునే మందుల డోస్ విషయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి మందులను మార్చడం లేదా ఇన్సులిన్ ఇవ్వడం వంటి చర్యలను తీసుకుంటారు. వైద్యుల సూచనల మేరకే మందులను వాడాలి. ఎవరికి వారు స్వతహాగా నిర్ణయాలు తీసుకుని మందులు వాడకూడదు.

షుగర్ కంట్రోల్ లో లేకుంటే కీటోన్లను పర్యవేక్షించడం ముఖ్యం

రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో కీటోన్లను పర్యవేక్షించడం ముఖ్యం. అధిక కీటోన్ స్థాయిలు డయాబెటిక్ కీటోఆసిడోసిస్ (DKA) అనే తీవ్రమైన పరిస్థితి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ షుగర్ కంట్రోల్ కాకపోతే తక్షణం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+