Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అన్నం గంజిని వేస్ట్ గా పారబోయొద్దు- ఎన్నెన్నో ప్రయోజనాలు

సాధారణంగా అన్నం వండిన తర్వాత గంజిని పారబోస్తుంటాం. ఈ గంజిలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని చాలామందికి తెలియదు. ఇది చర్మ ఆరోగ్యం, జీర్ణక్రియ, శరీరానికి తగినంత ఎనర్జీ వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. వీటి ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. మొటిమల నివారణ, చర్మం నిగారింపు: బియ్యం గంజి చర్మాన్ని కాంతివంతం చేయడానికి, మొటిమలను తగ్గించడానికి కొరియన్, జపనీస్ అందాల సంరక్షణలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే విటమిన్లు, అమైనో ఆమ్లాలు మచ్చలను తొలగిస్తాయి. చర్మాన్ని మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతాయి. దీన్ని కాళ్లు, చేతులపై అప్లై చేయడం వల్ల చర్మ రంధ్రాలు బిగుతుగా మారి, చర్మ ఆకృతి మరింత మెరుగుపడుతుంది.

2. డీహైడ్రేషన్ నివారిణ: ముఖ్యంగా వేసవి కాలంలో బియ్యం గంజి తాగడం వల్ల శరీరానికి తేమ అందుతుంది. ఇందులో ఉండే స్టార్చ్ శరీరంలో నీటిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌ బారిన పడటాన్ని నివారించవచ్చు. ఇది సహజ ఎలక్ట్రోలైట్‌గా కూడా పనిచేస్తుంది. హానికారక ఎనర్జీ డ్రింక్స్‌కు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

3. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: బియ్యం గంజిలో అధిక మొత్తంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది, ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పులియబెట్టిన బియ్యం గంజి ప్రోబయోటిక్‌గా పనిచేస్తుంది, ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రాత్రిపూట బియ్యం గంజిని పులియబెట్టి, ఉదయం నల్ల ఉప్పుతో తాగడం దీనికి సులభమైన మార్గం.

4. శరీర వేడిని తగ్గిస్తుంది: బియ్యం సహజంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. డయాబెటిస్, మెనోపాజ్ లేదా అధిక సూర్యరశ్మి కారణంగా శరీర వేడితో బాధపడేవారికి బియ్యం గంజి చాలా ప్రయోజనకరం. క్రమం తప్పకుండా బియ్యం గంజి తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. వేడి సంబంధిత అసౌకర్యం నుండి ఉపశమనం లభిస్తుంది.

5. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల (UTI) నుండి ఉపశమనం: మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే మంటను తగ్గించడంలో బియ్యం గంజి ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఇది విషపదార్థాలను బయటకు పంపి, మూత్రనాళంలో చికాకును తగ్గిస్తుంది. ఉపశమనాన్ని కల్పిస్తుంది.

6. రుతుక్రమ నొప్పిని తగ్గిస్తుంది: రుతుక్రమ సమయంలో తీవ్రమైన తిమ్మిర్లు, ఉబ్బరం, అధిక రక్తస్రావంతో బాధపడే మహిళలకు బియ్యం గంజి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పొత్తికడుపు నొప్పిని తగ్గిస్తాయి.

7. సహజ శక్తి వర్థకం: బియ్యం గంజి శక్తికి సహజ వనరు. ఇందులో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. అనారోగ్యం నుండి కోలుకుంటున్న వారికి ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. పోషకాలను తిరిగి నింపి, శరీరానికి తగినంత ఎనర్జీని అందిస్తుంది. వ్యాయామం తర్వాత లేదా అలసటగా ఉన్నప్పుడు ఈ గంజిని తాగడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది.

8. పుష్కలంగా పోషకాలు: వండిన అన్నం గంజిలో విటమిన్ B1, B2, B6 వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియ, మెదడు పనితీరుకు అవసరం. అలాగే, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి.

9. రక్తపోటును నియంత్రణ: గంజిలోని పొటాషియం శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి రక్షించుకుంటుంది.

10. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది: గంజిలోని అధిక ఫైబర్ కంటెంట్ సులభంగా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+