Health tips: మధుమేహ బాధితులు.. ఈ 5 తప్పులు అస్సలు చెయ్యొద్దు!!
క్రమబద్ధమైన జీవన విధానం లేకపోవడం, పెరుగుతున్న ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు మధుమేహ బాధితులుగా మారుతున్నారు. రోజురోజుకూ సమాజంలో మధుమేహ బాధితులు పెరుగుతున్నారు. మధుమేహాన్ని నియంత్రించాలి అంటే సరైన జీవన విధానం అవసరం. సమతుల ఆహారం తీసుకోవడం కూడా అంతే అవసరం.
మధుమేహం వచ్చిన తర్వాత కూడా తెలిసి తెలియక చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. అసలు మధుమేహ బాధితులు ఎటువంటి తప్పులు చేయకూడదు? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మధుమేహ బాధితులు ఎప్పుడు మధుమేహం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకుంటూ ఉండాలి.

చక్కెర స్థాయిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయకపోతే, ఎక్కువ చక్కెర స్థాయిలు ఉంటే అది శరీరంలోని అనేక అవయవాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఈ విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా అవసరం.
ఒకవేళ వారు వ్యాయామాన్ని మానుకుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేస్తే చాలా ఎక్కువ చేయడం కూడా ప్రమాదం. అధికంగా వ్యాయామం చేయడం వల్ల కూడా మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీరానికి హాని కలుగుతుంది. కాబట్టి అతిగానూ, అల్పంగానూ వ్యాయామం చేయకుండా ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో వ్యాయామం చేయడం అవసరం.

మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామం చేసిన తర్వాత ఖచ్చితంగా కండరాలను విశ్రాంతినివ్వాలి. ఒకవేళ అలా కాకుంటే అది మీ శరీరానికి హాని కలిగిస్తుంది. ధూమపానం చేసేవారికి, మద్యపానం ఎక్కువగా చేసే వారికి మధుమేహం ఉంటే వారికి గుండెపోటు, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం గణనీయంగా ఉంటుంది. కాబట్టి ధూమపానం, మద్యపానం మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయరాదు.
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారంలో ఉప్పును, చక్కెరను తీసుకునే విషయంలో జాగ్రత్త వహించాలి. విపరీతంగా ఆహారంలో ఉప్పును, చక్కెరను మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోకూడదు. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయకూడని ప్రధానమైన తప్పులు. మరి డయాబెటిస్ పేషెంట్స్.. వీటి విషయంలో ఎప్పటికీ జాగ్రత్తగా ఉండండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications