Health tips: ఎక్కువసేపు కంప్యూటర్ల ముందు కూర్చుంటే ఆయుష్హు తగ్గుతుంది.. జాగ్రత్త!!

చాలామంది ఉద్యోగాలు చేసేవారు, చదువుకునేవారు గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. కానీ అది ఏ మాత్రం మంచిది కాదని అంటున్నారు వైద్యులు.ఎక్కువసేపు కూర్చునే వారికి ఆయుష్షు తగ్గుతుందని అంటున్నారు. వారికి మరణం సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ ల ముందు కూర్చోవటం వల్ల అనేక శారీరక సమస్యలు వస్తాయి. అంతేకాదు డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వస్తాయి.

రోజుకు తొమ్మిదిన్నర గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ల ముందు కూర్చునే వారిలో మరణ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువసేపు కంప్యూటర్ స్క్రీన్ ల ముందు కూర్చోకూడదు. కనీస అరగంటకు ఒక్కసారైనా లేచి ఒక్క 5 నిముషాలు అయినా అటూ ఇటూ నడిచి మళ్ళీ వర్క్ చేసుకోవాలి. అంతేకాదు ఎక్కువసేపు అదే పనిగా పని చేయటం వల్ల భుజాలు, వీపు బిగుసుకుపోయినట్టు ఉంటాయి.

Health tips: Doing work on computers for a long time, life span will decrease!!

ఇక అలాంటి పరిస్థితిలో అక్కడే కూర్చుని కొన్ని వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తే మంచిది. చాలా మంది ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ ను మెడకు సమానమైన ఎత్తులో పెట్టుకోరు. క్రిందికి చూస్తూ సరైన భంగిమలో కూర్చోకుండా పని చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

సర్వైకల్ సమస్య, వెన్నునొప్పి వంటివి వేధిస్తాయి. అందుకే మన తలకు సమానంగా ఉండేలా కంప్యూటర్ స్క్రీన్ ఉండేలా చూసుకోవాలి. అదే పనిగా కంప్యూటర్ ముందు కూర్చుంటే కంటి సమస్యలు వస్తాయి, చర్మ సంబంధమైన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి.
ఎప్పుడూ కంఫర్ట్ గా ఉండే కుర్చీలోనే కూర్చోవాలి.

కంప్యూటర్ డెస్క్ ముందు కూర్చునేవారు పాదాలు నేలను తాకేలా, మోకాళ్ళ వెనుక భాగం 90 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి.అన్నిటికంటే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుంటే జీవక్రియ తగ్గిపోతుందని తెలుసుకోవాలి. మధ్య మధ్యలో కాస్త లేచి తిరగటం మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సాధ్యమైనంత ఈ టిప్స్ పాటిస్తే ఎక్కువ గంటలు కంప్యూటర్ల ముందు కూర్చోవటం వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+