health tips: సాయంత్రం టీ తాగటం హానికరమా? తెలుసుకోండి!!
భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడతారు. టీ తాగనిదే ఏ పనీ చేయలేక పోతున్నామని బాధపడేవారు కూడా ఉన్నారు. అయితే టీ తాగేవారు టీ ఎంత వరకు తాగితే మంచిది? ఏ సమయంలో తాగితే మంచిది? ఉదయం, సాయంత్రం టీ తాగడం మంచిదేనా? వంటి అనేక వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
టీ తాగేవారు ఒక నిర్దిష్ట సమయం వరకు మాత్రమే టీ తాగాలి. ఇక అతిగా టీ తాగితే మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. చాలామంది పనుల ఒత్తిడిలో ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగుతూనే ఉంటారు. రోజుకు చాలాసార్లు టీ తాగేవాళ్ళు కూడా లేకపోలేదు. అయితే అటువంటి వారు ఎక్కువగా టీ తాగకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక సాయంత్రం పూట టీ తాగడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.
సాయంత్రం పూట టీ తాగడం వల్ల శరీరంపై కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. భారతదేశంలో ఉన్న జనాభా 64% మంది ప్రతిరోజు టీ తాగడానికి ఇష్టపడతారు. అందులో 30 శాతం కంటే ఎక్కువ మంది సాయంత్రం ఖచ్చితంగా టీ తాగుతారు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం సాయంత్రం టీ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

సాయంత్ర సమయంలో టీ తాగడం వల్ల టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి సమస్యలు, లివర్ డిటాక్స్ సమస్యలు, జీర్ణక్రియ సమస్యలు, ఇన్ఫ్లమేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పడుకోవడానికి పది గంటలు ముందు కచ్చితంగా టీకి దూరంగా ఉండాలి. భారతదేశంలోని ప్రజలు పాలతో టీ ని చేసుకొని తాగుతారు కాబట్టి అది టీలో ఉండే అనేక ముఖ్యమైన మూలకాల శక్తిని తగ్గిస్తుంది.
పాలతో టీ చేసుకొని తాగడం అంత మంచిది కాదని కూడా చెప్పొచ్చు. రాత్రి సమయాలలో నైట్ షిఫ్టు డ్యూటీలు చేసేవారు అప్పుడప్పుడు సాయంత్రం సమయంలో టీ తాగొచ్చు. కానీ టీ తాగడం ఒక అడిక్షన్ లా చేసుకొని పదే పదే టీ తాగడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిదికాదు. ముఖ్యంగా సాయంత్రం వేళ టీ తాగకుండా మానేస్తేనే ఆరోగ్యానికి మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications