మందులతో కాదు ఈ ఆహారాలతో హైబీపీ కంట్రోల్ అవుతుంది.. ట్రై చెయ్యండి!
భారతదేశంలో అధిక రక్తపోటు లేదా హైపర్‌టెన్షన్ ఒక సాధారణ ఆరోగ్య సమస్య. అయితే దేశంలో హైబీపీ కేసులు పెరుగుతున్న క్రమంలో ఇది తీవ్ర ఆరోగ్య సమస్యగా పరిణమిస్తోంది. హై బీపీని తగ్గించుకోవడం కోసం నిత్యం మనం కొన్ని ఆహారాలను మన డైట్ లో చేర్చడం రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆకుకూరలు
మన ఆహారంలో ఆకుకూరలను చేర్చటం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది మన బీపీని కంట్రోల్ చేస్తుంది. పాలకూర, బచ్చలి కూర, తోటకూర వంటి ఆకుకూరలు పొటాషియం పుష్కలంగా ఉండడంతో, ఎక్కువ సోడియంను తొలగించడానికి దోహదం చేస్తాయి. తద్వారా ఇది మన రక్తపోటును నియంత్రిస్తాయి.

ఈ పండ్లతో హైబీపీ కంట్రోల్
మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల పండ్లు కూడా మన హైబీపీని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో బ్లూ బెర్రీలు ఫ్లేవనాయిడ్లను కలిగి ఉండి బీపీని తగ్గించడానికి దోహదం చేస్తాయి. అరటిపండ్లు కూడా పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల మన రక్తపోటు స్థాయిలను గణనీయంగా నియంత్రిస్తాయి.
బీపీని కంట్రోల్ చేసే ఆహారాలలో ఇది బెస్ట్
మనం ఆహారంలో తీసుకునే బీట్రూట్ రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. బీట్రూట్లో నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాలను తెరవటంతో పాటు రక్తపోటును తగ్గించడానికి దోహదం చేస్తుంది. బీట్రూట్ జ్యూస్ ను తాగినా, లేక బీట్రూట్ ను సలాడ్లలో భాగంగా తీసుకున్నా రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది.
వెల్లుల్లి, ఓట్స్ తో బీపీకి చెక్
వెల్లుల్లి హైబీపీని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకోవడం రక్తపోటును నియంత్రిస్తుంది. ఓట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాక రక్తపోటును కూడా తగ్గిస్తాయి. ఓట్స్ లో బీటా గ్లూకాన్ లు ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తాయి.
ఈ నట్స్, సీడ్స్ బెస్ట్
మన ఆహారంలో భాగంగా చేసుకునే సీడ్స్ , నట్స్ కూడా హైబీపీని కంట్రోల్ చేయడానికి దోహదం చేస్తాయి.బాదంపప్పు, వాల్నట్స్ మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఇక ఫ్లాక్స్ సీడ్స్ కూడా హైబీపీని కంట్రోల్ చేసే ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ కూడా హైబీపీని కంట్రోల్ చేస్తుంది. 70 శాతం కోకో కలిగిన డార్క్ చాక్లెట్ ఫ్లేవనాయిడ్ లను కలిగి ఉంటుంది. ఇవి రక్తపోటును తగ్గించడానికి దోహదం చేస్తాయి. కనుక పైన పేర్కొన్న ఆహారాలను మన డైట్ లో భాగంగా చేర్చుకుంటే హైబీపీని కంట్రోల్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications