Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమోస, కఛోరీ, వడపావ్.. తెగ తింటున్నారా?- కేంద్రం వార్నింగ్

ఈవినింగ్ స్నాక్స్ గా మనం సమోసా, వడపావ్, కఛోరి, జిలేబీ.. వంటి ఫుడ్ ఐటమ్స్ తింటుంటాం. నోటికి రుచిగా అనిపిస్తే చాలు వెనుకాముందు చూడం. ఇలా తినడం వల్ల ఊబకాయ సమస్య తలెత్తుతోంది. ఆందోళనకరంగా పరిణమిస్తోంది. అంటువ్యాధులు సైతం ప్రబలడానికి ఇది కారణమౌతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తాజా ఆదేశాలు ఇచ్చింది. స్నాక్స్‌ ఐటమ్స్ అన్నింటిపైనా చట్టబద్ధమైన హెచ్చరికను ప్రదర్శించాలని కోరింది. ఇకపై ఈ ఆహార పదార్థాల్లో నూనె, ఉప్పు, కారం, చక్కెర వంటి కంటెంట్‌ ను ఎంత మోతాదులో వినియోగించారనేది తెలియజేయాల్సి ఉంటుంది. దీన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది.

సిగరెట్ ప్యాకెట్లపై ఎలా అయితే చట్టబద్ధమైన హెచ్చరికను ముద్రిస్తోన్నారో.. అలాంటి వార్నింగ్ నే ఇక వీటి అమ్మకాలపైనా ప్రదర్శించాలని కేంద్రం భావిస్తోంది. ఊబకాయం, అంటువ్యాధులను ఎదుర్కోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా, అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, స్వయంప్రతిపత్త సంస్థలు భారతీయ స్నాక్స్‌పై హెచ్చరికలను ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.

ఈ ఆహార పదార్థాలలో నూనె, చక్కెర శాతం ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఊబకాయంపై పోరాటంపై రోజువారీ రిమైండర్‌లను బలోపేతం చేయడానికి లెటర్‌హెడ్‌లు, ఎన్వలప్‌లు, నోట్‌ప్యాడ్‌లు, ఫోల్డర్‌లు మొదలైన అన్ని అధికారిక స్టేషనరీలపై ఆరోగ్య సందేశాలను ముద్రించాలని కూడా పిలుపునిచ్చింది.

సమోసాలు, జిలేబీలు, వడపావ్‌లు హానికరమా?

ఊబకాయం అనేది తీవ్రమైన సమస్యగా మారింది భారత్ లో. దీన్ని నివారించాల్సిన అవసరం ఉందని కేంద్రం గుర్తించింది. ఈ క్రమంలో ప్రజల జీవనశైలిలో ప్రధానమైన ఆహార వ్యవహారాల్లో తేలికపాటి మార్పులను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీన్ని మార్చుకోవడం వల్ల ఊబకాయం సహా కొన్ని రకాల అంటువ్యాధులను సైతం నివారించవచ్చని భావిస్తోంది.

జిలేబీలు వంటి ఆహారాలు చాలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి. ఎటువంటి పోషక విలువను అందించకపోగా.. రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. ఫలితంగా- ఊబకాయం మాత్రమే కాదు, ఈ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం, హైబీపీ, హై కొలెస్ట్రాల్ వంటి అనేక ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి.. అని సీనియర్ కార్డియాలజిస్ట్, గ్రూప్ కార్డియాక్ క్యాత్ ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ సమీర్ గుప్తా అన్నారు.

సమోసాలు, వడపావ్‌, కఛోరీ వంటి ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కడుపులో మంటకు ఇది కారణమౌతుంది. గుండె అనారోగ్యానికి దారి తీయడంతో పాటు రక్త ప్రసరణలో ఇబ్బందులు కలిగించడానికి ఇదే ప్రధాన కారణమౌతోంది.. అని వివరించారు.

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా భారత్ లో ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. సాధారణ ప్రజలకు ఆహార పోషక విలువ గురించి అవగాహన కల్పించాలి. ఆహార ఎంపికలో చైతన్యం అవసరం.. అని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు.

ఊబకాయం భారం

సమోస, కఛోరీ, వడపావ్, జిలేబీ వంటి ఆహార పదార్థాల తయారీలో ఎంతమేర ఉప్పు, చక్కెర, కారం, నూనెను వినియోగించారనేది ఇకపై తప్పనిసరిగా తెలియజేసేలా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. ఇది- స్టాచ్యుటరీ వార్నింగ్. అంటే సిగరెట్ పాకెట్లపై ఉండే లేబుల్స్ లా పనిచేస్తుంది.

ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బుల వంటి సమస్యలు దేశంలో తీవ్రంగా పెరుగుతున్నాయని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి అయిదుమందిలో ఒకరు ఒబేసిటీతో బాధపడుతున్నారు. మహిళల్లో 24, పురుషుల్లో 23 శాతం ఊబకాయం ఉంటోంది.

లాన్సెట్ స్టడీ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది. 2050 నాటికి భారత్ లో సుమారు 450 మిలియన్ల మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉంటారని అంచనా వేసింది. మెరుగైన ఆరోగ్య విధానాలను పాటించడం, శారీరక శ్రమ, మంచి ఆహారపు అలవాట్లు, పోషకాహారాన్ని తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటి విధానాల ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చని సూచించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+