రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్'.. లంచ్ బాక్స్ లకు పర్ఫెక్ట్ రెసిపీ..!
బిర్యానీ తర్వాత అంతలా చాలా మంది ఇష్టంగా తినేది జీరా రైస్.. హోటల్స్, రెస్టారెంట్స్ కు వెళ్లినప్పుడు జీరా రైస్ ను ఆర్డర్ చేస్తుంటారు. ఇక ఇంట్లోనూ వీకెండ్స్ లో జీరా రైస్ తయారు చేస్తుంటారు. అయితే కొంతమందికి జీరా రైస్ పర్ ఫెక్ట్ గా కుదురుతుంది.. కొందరికి కుదరదు. మరి సింపుల్ అండ్ టేస్టీగా జీరా రైస్ ను ఎలా చేసుకోవచ్చు..? ఇలా చేస్తే పొడిపొడి లాడుతూ చాలా రుచికరంగా ఉంటుంది. ఈ జీరా రైస్ దాల్ తడ్కా, పనీర్ కర్రీ, నాన్ వెజ్ వంటలతో అద్దిరిపోతుంది. మరి ఈ టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' తయారీకి కావాల్సిన పదార్థాలు బాస్మతి బియ్యం ఒక కప్పు, నీళ్లు రెండు కప్పులు, నెయ్యి రెండు టేబుల్ స్పూన్ లు, నూనె ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, లవంగాలు మూడు, దాల్చిన చెక్క ఒక అంగుళం, బిర్యానీ ఆకు ఒకటి, యాలకులు రెండు, పచ్చిమిర్చి ఒకటి, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి.

ఇప్పుడు తయారీ విధానం చూస్తే.. మొదటగా బాస్మతి బియ్యాన్ని కడిగి 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ నీటిలోనే 70 నుంచి 80 శాతం ఉడికించుకోవాలి. ఆ తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. పాన్ లో నెయ్యి , నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత అందులోనే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన బియ్యాన్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టాలి. ఇప్పుడు అలాగే స్లో మంట మీద ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే సూపర్ టేస్టీ జీరా రైస్ రెడీ అయినట్టే.. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసుకోండి.. టేస్ట్ అద్దిరిపోద్దీ..












Click it and Unblock the Notifications