బ్రెజిల్ పై పిడుగు- సూపర్ స్టార్ నెయ్‌మార్ అవుట్
ఫిఫా వరల్డ్ కప్ సాకర్ మ్యాచ్ లు అదరగొడుతున్నాయి. ఇప్పటికే ఇందులో బోణీ కొట్టింది హాట్ ఫేవరెట్ మెక్సికో. టోర్నమెంట్ ఓపెనర్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. గ్రూప్ డీ లో భాగంగాప్రస్తుతం అమెరికా- పరాగ్వే మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. మున్ముందు మరిన్ని మెరుపుల్లాంటి మ్యాచ్ లు ఆలరించనున్నాయి. అయిదుసార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు అభిమానులు
ఈ పరిణామాల మధ్య బ్రెజిల్ కు భారీ షాక్ తగిలింది. సూపర్ స్టార్ నెయ్‌మార్ లేకుండానే తన ప్రయాణాన్ని ప్రారంభించనుందీ జట్టు. గ్రూప్ సీలో భాగంగా భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మొరాకోతో జరిగే బ్రెజిల్ మొదటి మ్యాచ్ ఈ సూపర్ స్టార్ దూరం అయ్యాడీ జట్టు ఆల్‌టైమ్ టాప్ స్కోరర్. ఈ విషయాన్ని హెడ్ కోచ్ కార్లో అన్చెలోట్టి వెల్లడించారు. మొరాకోపై ఆడే అవకాశం లేదని స్పష్టం చేశారు. 2022 వరల్డ్ కప్ సెమీఫైనలిస్ట్ మొరాకొ. న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం.. దీనికి వేదిక.

ప్రీమ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్చెలోట్టి మాట్లాడారు. నెయ్ మార్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్నాడని, మొరాకోతో జరిగే మ్యాచ్ కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు. అత్యంత విలువైన ఆటగాడు కావడంతో అతని విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోన్నామని స్పష్టం చేశారు. అతని సేవలు గోల్స్ వరకు మాత్రమే పరిమితం కాదని వ్యాఖ్యానించారు. వందశాతం ఫిట్ నెస్ ను సాధించడానికి ఈ స్టార్ ఫార్వర్డర్ కష్టపడుతున్నాడని అన్నారు.
నెయ్‌మార్.. 2023 తర్వాత బ్రెజిల్ తరఫున మైదానంలో కనిపించలేదు. మే రెండోవారంలో కుడి కాలికి గాయం తగలడంతో అతను అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. 34 ఏళ్ల ఈ ఫార్వర్డ్‌ను ఫిట్‌నెస్‌పై సందేహాలు ఉన్నప్పటికీ వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నారు. ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభం నాటికి అతను కోలుకుంటాడని జట్టు ఆశించింది. మొరాకోతో జరిగే మ్యాచ్ నాటికి కూడా ఫిట్ నెస్ లో పెద్దగా మార్పులు లేకపోవడంతో విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ నెల 19న హైతీతో రెండో మ్యాచ్ ఆడాల్సి ఉంది బ్రెజిల్ కు. ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని జట్టు ఆశిస్తోంది. అతని విషయంలో రిస్క్ తీసుకునే అవకాశం తక్కువే. ఆ తర్వాతి మ్యాచ్ లలో నెయ్ మార్ ఆడటం అనేది పూర్తిగా అతని ఫిట్ నెస్ మీదే ఆధారపడి ఉంటుంది. బ్రెజిల్‌ను ఈసారి కూడా టోర్నమెంట్ ఫేవరెట్లలో ఒకటిగా భావిస్తున్నప్పటికీ స్టార్ ఫార్వర్డర్ గైర్హాజరు జట్టుకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. అతని అనుభవం, నాయకత్వం రెండూ కీలకమే. ఇప్పటివరకు ఆయన బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు అతనే.












Click it and Unblock the Notifications