కలగూర, టమాటా రోటి పచ్చడి.. తింటే అస్సలు వదిలిపెట్టరు!
మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉంటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇక ఆకుకూరలను తింటే మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా అందుతాయి. అయితే చాలామంది ఆకుకూరలను కూరగా వండితే ఇష్టంగా తినరు.
కలగూర, టమాటా పచ్చడి
అదే పచ్చడి చేస్తే చాలా ఇష్టంగా లాగిస్తారు. అందుకే ఆకుకూరలు ఏవైనా సరే కాస్త టమాటాలు జోడించి పచ్చడి చేస్తే అది వేడి అన్నంలో అమృతంలా పోతుంది. అసలే ఆకుకూరలు తనని వారు కూడా తింటారు. ప్రస్తుతం మనం కలగూర(తోటకూర), టమాటా పచ్చడి ఎలా తయారు చెయ్యాలో చూద్దాం .

కావలసిన పదార్థాలు:
కలగూర ( తోటకూర) – 2 కట్టలు
టమాటాలు – 4
పచ్చిమిర్చి – 10 కారాన్ని బట్టి
వెల్లుల్లి – 8 రెబ్బలు
ఉప్పు – తగినంత
జీలకర్ర -1 టేబుల్ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు – ½ స్పూన్
పోపు గింజలు- 1 స్పూన్
ఎండుమిర్చి – 1
చింతపండు- కొద్దిగా
కరివేపాకు – 2 రెమ్మలు
తయారీ విధానం:
ముందుగా కలగూరను అందులోనూ తోటకూరను శుభ్రంగా కడిగి నీరు వడకట్టాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కట్ చేసిన టమాటాలు, పచ్చి మిర్చి, కొద్దిగా చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత అదే పాన్ లో తోటకూర వేసి బాగా మగ్గేవరకు ఉంచాలి. స్టౌవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీనిని మిక్సీలో కానీ, రోట్లో కానీ నూరుకోవాలి. రోట్లో నూరితే సూపర్ టేస్ట్ ఉంటుంది.
ఇలా చేస్తే అసలే వదిలిపెట్టరు
ఉప్పు వేసి రోటిలో లేదా మిక్సీలో బాగా పేస్ట్ లా కాకుండా నూరాలి. నూరే సమయంలో అందులో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి వేసి నూరుకోవాలి. తర్వాత మరో పాన్‌లో నూనె వేసి అందులో పోపు గింజలు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఆ తాలింపును పచ్చడిలో కలపాలి. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలను కలుపుకుని తింటే బాగుంటుంది . రుచికరమైన కలగూర టమాటా పచ్చడి రెడీ అయ్యింది. ఈ పచ్చడిని అన్నంలో కానీ, రోటీ, జొన్న రొట్టె ఇలా ఎందులో తిన్నా బాగానే ఉంటుంది. దీంతో అన్నం వదిలిపెట్టకుండా తినేస్తారు.
-
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications