నాన్‌వెజ్ నూడుల్స్ తయారీ.. చికెన్ గ్రేవీ వేస్ట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్ నూడుల్స్!
బ్యాచిలర్లు, వర్క్ బిజీలో ఉండేవారు, వంట చేసుకోవటానికి సమయం లేని వారికి నూడుల్స్ చేసుకోవటం చాలా తేలిక పని. ఇన్స్టంట్ నూడుల్స్ తయారు చేసుకుని ఎక్కువగా తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు నాన్ వెజ్ తో సూపర్ టేస్టీ నూడుల్స్ తయారు చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ నాన్‌వెజ్ నూడుల్స్‌ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా మిగిలిన చికెన్ గ్రేవీని స్మార్ట్‌గా ఉపయోగించడం ద్వారా నూడుల్స్ రుచి అదిరిపోతుంది. మరి హోటల్ స్టైల్ నాన్ వెజ్ నూడుల్స్ తయారుచేయటం ఎలాగో చూద్దాం.
కావలసిన పదార్థాలు
నూడుల్స్ ప్యాకెట్: 1 (మాగీ లేదా ఏదైనా ఇన్‌స్టంట్ నూడుల్స్)
చికెన్ గ్రేవీ- మిగిలిన చికెన్ కర్రీ గ్రేవీ.. 1 కప్
నూనె: 2 స్పూన్లు
కారం పొడి: సరిపడా
మిరియాల పొడి: ½ టీస్పూన్
నూడుల్స్ ప్యాకెట్‌లో వచ్చిన మసాలా సాచెట్: 1

తయారీ విధానం
ఒక పెద్ద గిన్నెలో తగినంత నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరగించాలి. నీళ్లు బాగా మరిగాక నూడుల్స్, 2 స్పూన్ల నూనె, కారం పొడి, మిరియాల పొడి మరియు ప్యాకెట్‌లోని మసాలా వేసి బాగా కలపాలి. నూడుల్స్ సాఫ్ట్ అయ్యే వరకు వండాలి. నూడుల్స్ బాగా ఉడికిన తర్వాత మంట ఆపేసి, చికెన్ గ్రేవీని వేడి చేసి నూడుల్స్‌లోకి కలపాలి.
త్వరగా తయారీ, ఆకలి తీర్చే నూడుల్స్
బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఆపై వేడిగా నూడుల్స్ ను సర్వ్ చేయవచ్చు. పైన కొద్దిగా కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవచ్చు. చికెన్ గ్రేవీ ఎక్కువగా ఉంటే నూడుల్స్ రుచి ఇంకా బాగుంటుంది. ఎక్కువ కారంగా కావాలంటే కారం పొడి మరింత వేయవచ్చు. ఈ వంటకం ఉదయం లేదా రాత్రి త్వరగా ఆకలి తీర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
మిగిలిన చికెన్ గ్రేవీని వేస్ట్ చేయకుండా నూడుల్స్
నూడుల్స్ ను ఎక్కువ నీళ్ళలో ఎక్కువ సేపు ఉడికించకూడదు. ఇంట్లో వండుకుని తినగా మిగిలిన చికెన్ గ్రేవీని వేస్ట్ చేయకుండా ఈ సులభమైన నాన్‌వెజ్ నూడుల్స్ తయారు చేసుకోండి. రుచి హోటల్ స్టైల్‌కి దాదాపు సమానంగా వస్తుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది













Click it and Unblock the Notifications