ఛాయ్ ఎంతసేపు మరిగిస్తున్నారు?
తేనీరు సేవించనివారంటూ ఎవరు ఉండరు. తలనొప్పిగా అనిపించినా, పనిలో ఒత్తిడి ఉన్నా వాటి నుంచి ఉపశమనం కలగాలంటే ఒక కప్పు ఛాయ్ తాగాల్సిందే. ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగి దినచర్యను ప్రారంభించేవారే ఎక్కువ. రుచినిబట్టి, ఆరోగ్యాన్ని బట్టి బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, మిల్క్ టీ తాగుతుంటారు. వీటిలో మిల్క్ టీ అంటే అందరికీ ఇష్టం.
పాలల్లో ఎక్కువగా టీ ఆకులు వేసి ఎక్కువసేపు మరిగించి తయారుచేసిన తేనీరు అంటే బాగా ఇష్టపడుతుంటారు. అయితే టీని ఎక్కువసేపు మరిగించడంవల్ల ఆరోగ్యానికి ఎంతో హాని అని, అతిగా మరిగిస్తే స్లో పాయిజన్ గా మారిపోవచ్చని పోషకాహార నిపుణులు అంటున్నారు.

ఎంతసేపు మరిగించాలి?
తేనీరు రుచిగా, ఆరోగ్యంగా ఉండేందుకు నాలుగు నుంచి ఐదు నిముషాలే మరిగించాలి.
ఎక్కువ సేపు మరిగిస్తే కలిగేనష్టాలు
శరీరంలో ఐరన్, కాల్షియం లోపం తలెత్తుతుంది. టీని అధిక సమయం మరించడంవల్ల టానిన్ ల పరిమాణాన్ని పెంచుతుంది. శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. అధిక టానిన్ శరీరంలో ఇనుము లోపం తలెత్తేలా చేస్తుంది. దీనివల్ల రక్తహీనత కలుగుతుంది. మిల్క్ టీని ఎక్కువగా మరిగిస్తే దాని pH మారిపోతుంది. టీ మరింత ఆమ్లంగా మారుతుంది. ఎక్కువగా మరిగితే ఆరోగ్యానికి హాని కలిగించే అక్రిలామైడ్ అనే క్యాన్సర్ కారక పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ, కడుపు నొప్పి, మలబద్దకంలాంటి సమస్యలు ఎదురవుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి
మరిగించిన తేనీరును మరింత మరిగించడం వల్ల దానిలో టానిన్ పరిమాణం పెరగడంతోపాటు రక్తపోటును పెంచుతుంది. అంతేకాదు.. టీ రుచి కూడా మారిపోతుంది. పాలల్లో ఉండే ప్రొటీన్, విటమిన్ డి, కాల్షియం వంటి అనేక పోషకాలు నాశనమవుతాయి. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి వంటివాటితోపాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా నశిస్తాయి.












Click it and Unblock the Notifications