సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..!
వేసవిలో పచ్చళ్లు, ఫ్రైలు కాకుండా తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సమ్మర్ లో ఎక్కువగా పులుసు, పప్పు, పెరుగు, ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే వేసవిలో శరీరానికి చలువ చేసే పెసరపప్పు చారు ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ పెసరపప్పు చారు సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వంటకాన్ని ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ పెసరపప్పు చారును ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
'పెసరపప్పు చారు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పెసరపప్పు తగినంత, ఉల్లిపాయలు, పసుపు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, ధనియాల పొడి, పచ్చికొబ్బరి పొడి, కొత్తిమీర తరుగు తీసుకోవాలి. ఇక తయారీ విధానం చూస్తే ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. అలాగే మరో గిన్నెలో చింతపండును కూడా తీసుకుని నానబెట్టాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి.

ఇక పెసరపప్పును కుక్కర్ లో వేసి నీళ్లు పోసి అందులోనే ఉల్లిపాయలు, పసుపు వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని మెత్తగా చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో చారుకు సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేయాలి. ఇక అందులోనే చింతపండు రసం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అలా లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేస్తే సరి.. సూపర్ టేస్టీ పెసరపప్పు చారు రెడీ అయినట్టే. దీన్ని తాళింపు చేసుకుని తినొచ్చు..












Click it and Unblock the Notifications