బ్రౌన్ రైస్ Vs రెడ్ రైస్‌- ఆరోగ్యానికి ఏది మంచిది..!?

ప్రస్తుతం తెల్ల అన్నం వినియోగం తగ్గింది. ఈ స్థానంలో చాలా మంది బ్రౌన్ రైస్ తింటున్నారు. బ్రౌన్ రైస్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. బ్రౌన రైస్ తో పాటుగా రెడ్ రైస్ కూడా వినియోగంలోకి వచ్చింది. ఈ రైస్ కూడా ఆరోగ్య పరంగా అనేక లాభాల‌ను అందిస్తుంది. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్ లోనూ అనేక పోష‌కాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిలో దేన్ని తినాలి.. ఎవరికి ఏ రైస్ మంచిది అనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ రెండు రైస్ లో ఎందులో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి..ఎవరికి ఏది మంచిదో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్ రెండింటిలోనూ ఫైబర్ ఉంటుంది. కానీ రెడ్ రైస్‌లో ఇది కాస్త ఎక్కువ మోతా దులో ఉంటుంది. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ బ్రౌన్ రైస్ క‌న్నా రెడ్ రైస్‌కే త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారికి బ్రౌన్ రైస్ క‌న్నా రెడ్ రైస్ ఎక్కువ మేలు చేస్తుంది. కాబ‌ట్టి ఈ విష‌యంలోనూ రెడ్ రైస్‌ కు ప్రాధాన్యత ఇస్తారు. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇక ఈ రెండింటిలోనూ మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్ స‌మానంగానే ఉంటాయి. కానీ ఐర‌న్‌, జింక్ వంటి పోష‌కాలు మాత్రం రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. క‌నుక ఈ రెండు ర‌కాల రైస్‌ల‌లోనూ రెడ్ రైస్‌ను క్లియ‌ర్ విన్న‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

Red rice is noticed to have roughly 10 times the antioxidant capacity of brown rice

పోష‌కాల విష‌యానికి వ‌స్తే రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. కాబ‌ట్టి బ్రౌన్ రైస్‌ను తింటున్న‌వారు ఈ రైస్‌ను తింటే ఇంకా ఎక్కువ ఫ‌లితం ఉంటుంది. ఈ రైస్‌ను తింటే శ‌రీరంలోని వాపులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ర‌క్త నాళాల వాపులు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల అధిక మొత్తంలో ఐర‌న్‌ను పొంద‌వ‌చ్చు. ఇది ర‌క్తం వృద్ధి చెందేలా చేస్తుంది
ఇక రెడ్ రైస్‌ను తింటే మెగ్నిషియం అధికంగా ల‌భిస్తుంది. ఇది ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పు చేస్తుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. హైబీపీ ఉన్న‌వారికి ఈ రైస్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

రెడ్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల క్యాల్షియం అధికంగా ల‌భిస్తుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రైస్‌లోని మెగ్నిషియం కండ‌రాల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల రాత్రి పూట నిద్ర‌లో కాలి పిక్క‌ లు ప‌ట్టుకుపోవ‌డం కూడా త‌గ్గుతుంది. రెడ్ రైస్‌ను తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. ఈ రైస్‌లో ఉండే ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్‌ను తగ్గిస్తాయి. దీని వ‌ల్ల డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా రెడ్ రైస్ వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు ఉంటాయి. క‌నుక బ్రౌన్ రైస్ తింటున్న‌వారు ఈ రైస్‌ను కూడా త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోండి. దీని వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. తెల్ల అన్నం తగ్గించి బ్రౌన్ రైస్ తీసుకుంటున్న వారు తరచూ ఈ తరహా రెడ్ రైస్ తీసుకోవటం ద్వారా ఆరోగ్య కరంగా ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+