వంటింట్లో తిష్ట వేసిన డేంజర్ పదార్థం.. ఏటా 19 లక్షమంది మృతి!
ఉప్పులేని ఆహారం రుచించదు. ఇది లేనిదే.. చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఆరోగ్యకమైన ఆహారాల పేరుతో మన వంటగదిలో లభించే వాటిల్లో ఉప్పు ఒకటి. వంటింట్లో నిత్యం వాడే ఈ పదార్థం మీ ఆరోగ్యాన్ని ఎంతలా హాని చేస్తుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వెల్లడించింది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 19 లక్షల మంది మరణిస్తున్నారని తెలిపింది.
ఆరోగ్య నిపుణులు హెచ్చరిక
ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ, చాలా మంది సిఫార్సు చేసిన దానికంటే రెట్టింపు సోడియంను తీసుకుంటున్నారు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్‌లు వస్తాయి. ఇవి అకాల మరణానికి ప్రధాన కారణాలు. దీనికి ప్రతిస్పందనగా, ప్రజలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పొటాషియం కలిగిన ఉప్పుకు మారాలని WHO కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

అధిక ఉప్పు ఎందుకు ప్రమాదకరం?
నరాల పనితీరుకు, శరీరంలో ద్రవాల సమతుల్యతకు ఉప్పు చాలా అవసరం. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణుల సిఫార్సు చేసిన దాని ప్రకారం రోజువారీగా 2 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. కానీ చాలా మంది రోజుకు 4.3 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటున్నారు. 2013లో, WHO సభ్య దేశాలు 2025 నాటికి జనాభాలో ఉప్పు వినియోగాన్ని 30% తగ్గించాలని ప్రతిజ్ఞ చేశాయి. అయితే ఆస్ట్రేలియాతో సహా చాలా దేశాలు ఈ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. ఇప్పుడు ఈ లక్ష్యాన్ని 2030కి మార్చారు.
ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటు.
ఆస్ట్రేలియాలో, గుండె సంబంధిత వ్యాధులను నివారించడానికి పౌరులు ఉప్పు తీసుకోవడం తగ్గించాలని ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు కోరుతున్నాయి. ఆస్ట్రేలియాలోని ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. NIH నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలో ఆహారం ద్వారా తీసుకునే సోడియంలో దాదాపు 80% ప్రాసెస్ చేసిన ఆహారాల ద్వారానే వస్తుంది. కాబట్టి ఆహార పరిశ్రమలో సోడియం తగ్గింపు అనేది ఒక ముఖ్యమైన వ్యూహంగా మారింది.
ఉప్పుకు ప్రత్యామ్నాయం
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం పొటాషియం కలిగిన ఉప్పుకు మారాలని సిఫార్సు చేసింది. ఇది కొంత సోడియం క్లోరైడ్‌ను పొటాషియం క్లోరైడ్‌తో భర్తీ చేస్తారు. ఈ మార్పు రక్తపోటును తగ్గించడానికి, గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. పొటాషియం గుండె, కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు 3.5 గ్రాముల పొటాషియం తీసుకోవాలని WHO సిఫార్సు చేస్తుంది.
ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి:
అమెరికా, భారతదేశం వంటి దేశాలలో, ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి, ప్యాక్ చేసిన స్నాక్స్ అధిక సోడియం తీసుకోవడానికి దోహదం చేస్తాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా మారింది. కనుక ఆహార తయారీదారులు కూడా పొటాషియం కలిగిన ఉప్పుకు మారాలని WHO సిఫార్సు చేస్తుంది. పొటాషియ కలిగిన ఉప్పు సాధారణ ఉప్పులాగే రుచిని, పనితీరును అందిస్తుంది. కానీ దీనిలో సోడియం తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భారతదేశంతో పెరుగుతున్న రక్తపోటు కేసులను తగ్గించడానికి ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications