'కిస్‌మిస్' ను మిస్ చేస్తున్నారా..? ఇలా తీసుకుంటే బోలెడు లాభాలు..!
ఇంట్లో సేమియా, పాయసం, పరమాన్నం.. ఇలా ఏం చేసినా అందులో కిస్‌మిస్(ఎండు ద్రాక్ష) ను వేయడం మనకు అలవాటుగా ఉంటుంది. అయితే వీటిని తింటే బరువు పెరుగుతామేమోనన్న భయంతో కొంతమంది ఉంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం అని వైద్యులు చెబుతున్నారు. ఎండుద్రాక్షలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. కిస్ మిస్ లో ఫైబర్, ప్రోటీన్లు, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్ వంటి పోషకాలు ఉంటాయి.. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
కిస్ మిస్ లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండంటం ద్వారా ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి అలాగే అనారోగ్యాలను నివారిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఎండు ద్రాక్షను నానబెట్టి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కిస్ మిస్ సాధారణంగా తీపిగా ఉంటాయి. కాబట్టి వీటిని లడ్డూలు, పాయసం, స్వీట్స్ తయారీలో వాడతారు. అలాగే వీటిని రాత్రి నానబెట్టుకుని పరగడుపున తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు వివరిస్తున్నారు.

కిస్ మిస్ లో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీన్ని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇక పొటాషియం, ఫైటో న్యూట్రియంట్లు, యాంటీ ఆక్సిడెంట్లూ ఎండ ద్రాక్షలో ఎక్కువగానే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసే అలవాటు ఉన్న వారు కిస్‌మిస్ తీసుకుంటే అలసట రాదట. ఆకలిగా ఉన్నప్పుడు కిస్‌మిస్ తింటే తక్షణ శక్తిని పొందొచ్చని వైద్యులు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications