తమలపాకులతో ఫిష్ ఫ్రై.. ఇలా చేస్తే అదుర్స్

మృగశిర కార్తె రానే వచ్చింది. ఇప్పుడు అందరూ చేపల కూరను ఒక పట్టు పడతారు. అయితే మనం రొటీన్ గా వండుకునే చేపల కూర మాత్రమే కాదు, అప్పుడప్పుడు చేపలను కొత్తకొత్త వంటకాలుగా కూడా చేసుకు తినాలి. అలా చేపలకు సంబంధించి తమలపాకు చేప ఫ్రై చాలా స్పెషల్ వంటకం.

తమలపాకు ఫిష్ ఫ్రై

తమలపాకు ఫిష్ ఫ్రై అనేది చేపల రుచిని, తమలపాకు యొక్క సువాసనను కలిపే ఒక ప్రత్యేకమైన వంటకం. తమలపాకులతో ఫిష్ ఫ్రై చాలా సులభంగా మరియు తక్కువ సమయంలో చేసుకోవచ్చు. ఇది రుచికి కూడా తమలపాకు ఫ్లేవర్ తో ఘాటుగా చాలా బాగుంటుంది.

tamalapaku Fish Fry Recipe In Telugu Step-by-Step Guide For Home Cooking for best taste of fish fry

కావలసిన పదార్థాలు:

చేప ముక్కలు: అరకిలో

తమలపాకులు: 6 నుండి 8 (మెత్తగా పేస్ట్ చేసుకోవాలి)

ఉల్లిపాయ ముక్కలు: 1 కప్పు (చిన్న ముక్కలు)

పచ్చిమిర్చి: 3 (సన్నగా తరిగినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 స్పూన్

కారం: 2 స్పూన్లు

పసుపు: అర స్పూన్

గరం మసాలా: 1 స్పూన్

నిమ్మరసం: 1 స్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

నూనె: వేయించడానికి సరిపడా

తయారీ విధానం

ముందుగా తమలపాకులను మిక్సీ జార్‌లో వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఒక వెడల్పు గిన్నెలో తమలపాకుల పేస్ట్, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, మరియు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలను ఈ మసాలా మిశ్రమంలో వేసి, ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. కనీసం 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో మ్యారినేట్ అవ్వనివ్వాలి.

తమలపాకులతో ఫిష్ ఫ్రై ఇలా చేస్తే టేస్ట్

స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, 3 స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కాక మసాలా పట్టించిన చేప ముక్కలను పాన్ మీద ఉంచాలి. చిన్న మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించి దింపేయాలి.

 చింతచిగురు మటన్ కర్రీ.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!
చింతచిగురు మటన్ కర్రీ.. ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు!

చేపకు తమలపాకు ఫ్లేవర్

ఇలా చేస్తే రుచికరమైన, సువాసనభరితమైన తమలపాకు చేప ఫ్రై సిద్ధం.ఇలా మసాలా అంతా చేప ముక్కలకు పట్టించి ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క లోపలి వరకు మసాలా బాగా పట్టుకుంటుంది. తమలపాకు ఫ్లేవర్ చేపకు పడుతుంది. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. చేపల్లో ప్రోటీన్లు, విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును పెంచడానికి ఇవి తోడ్పడతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+