మటన్, బుడం దోసకాయ కూర.. తింటే అసలే వదిలిపెట్టరు!

రుచికరమైన నాన్‌వెజ్ వంటకాలలో మటన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ బుడం దోసకాయతో కలిపి చేసే మటన్ కూర అయితే దాని రుచి మరింత రెట్టింపు అవుతుంది. మటన్ మసాలా ఘాటు, దోసకాయ రుచి కలిసి అద్భుతమైన టేస్ట్ ఇస్తాయి.మరి మటన్ బుడం దోసకాయ కూర ఎలా చెయ్యాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు

మటన్- అరకేజీ

బుడం దోసకాయలు - పావుకిలో కట్ చేసిన ముక్కలు

ఉల్లిగడ్డలు - 1 పెద్దది కట్ చేసిన ముక్కలు

పచ్చి మిరపకాయలు - 3

అల్లం వెల్లుల్లి - ఒక స్పూన్

కారప్పొడి - 1 1/2 స్పూన్

ఉప్పు - 1 1/2 స్పూన్

ధనియాల పొడి - 1 స్పూన్

గరం మసాలా- 1 స్పూన్

పసుపు - అర స్పూన్

నూనె - 2 స్పూన్స్

Telangana Mutton Budam Dosakaya Curry Traditional Home Style Recipe with good taste and benefits

తయారీ విధానం

ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనెవేసి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి, బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త పచ్చి వాసన్ పోయాక అందులో మటన్ వెయ్యాలి. అందులో కాస్త పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో బుడం దోసకాయ ముక్కలు వేసి కలియబెట్టి కొద్దిసేపు ఉడికించాలి.

మటన్ ఇలా ఉండేదాకా ఉడికించాలి

ఆపై అందులో కారం, గరంమసాలా వేసి ఉడికించాలి. కూర చిక్కదనం బట్టి చూసి నీళ్ళు పోసుకుని ఉడికించాలి.పూర్తిగా ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి వేసి కాసేపు ఉడికించాలి. మటన్ ముక్క కట్ చేస్తే తునిగేలా ఉండాలి. కూర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

మటన్ బుడం దోసకాయ ఇలా చేస్తే సూపర్ టేస్ట్

ఈ మటన్, బుడం దోసకాయ కూర అన్నం లోకే కాదు, చపాతీ, రోటీలలోకి కూడా చాలా బాగుంటుంది. అంతేకాదు బుడం దోసకాయ వేయటం వలన ఇది ఈజీగా జీర్ణం అవుతుంది. శరీర వేడిని తగ్గిస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా వండితే ఆ కూర మీరు అసలే వదిలిపెట్టరు నమ్మండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+