తిరుమల స్పెషల్ కొబ్బరి పచ్చడి.. ఇలా చేస్తే అస్సలు వదిలిపెట్టరు!

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద భవనంలో వడ్డించే స్పెషల్ కొబ్బరి పచ్చడి రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా మనం ఇంట్లో చేసుకునే కొబ్బరి చట్నీ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కొబ్బరి ముక్కలను నూనెలో ప్రత్యేకంగా వేయిస్తారు.వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. ఆ అసలైన తిరుమల స్టైల్ కొబ్బరి పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు

పచ్చి కొబ్బరి ముక్కలు: 1 కప్పు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)

పచ్చి శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు

ఎండుమిర్చి: 15 నుండి 20 (మీ కారానికి తగినట్లు)

చింతపండు: నిమ్మకాయ సైజంత (ముందుగా నానబెట్టుకోవాలి)

పసుపు: పావు టీస్పూన్

ఉప్పు: రుచికి సరిపడా

ఆయిల్: డీప్ ఫ్రైకి మరియు తాలింపుకు సరిపడా

తాలింపు గింజలు: ఒక స్పూన్

ఇంగువ: చిటికెడు

కరివేపాకు: రెండు రెబ్బలు

Tirumala Style kobbari pachadi Recipe Secret TTD Annaprasadam coconut chutney At Home

తయారీ విధానం:

స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసి, మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే నూనెలో 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసి దోరగా వేయించి పక్కకు తీయాలి.

కొబ్బరి పచ్చడి ఇలా చేస్తేనే రుచి

ఆ తర్వాత అదే వేడి నూనెలో ఎండుమిర్చిని కూడా వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. వీటన్నింటినీ పూర్తిగా చల్లారనివ్వాలి.ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించిన ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా బరకగా పట్టుకోవాలి. ఆ తర్వాత వేయించిన కొబ్బరి ముక్కలు, నానబెట్టిన చింతపండు (నీటితో సహా) మరియు పసుపు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పచ్చడిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

పచ్చడిలో తాలింపు తో సూపర్ రుచి

కొబ్బరి పచ్చడి మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకూడదు.మరో చిన్న పాన్‌లో రెండు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు మరియు ముఖ్యంగా చిటికెడు ఇంగువ వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి.

కలగూర పులుసు ఇలా చేస్తే రోజూ తినేదాని కన్నా డబుల్ తింటారు!
కలగూర పులుసు ఇలా చేస్తే రోజూ తినేదాని కన్నా డబుల్ తింటారు!

తిరుమల కొబ్బరి పచ్చడి రుచి రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి

తిరుమల కొబ్బరి పచ్చడి అసలైన రుచి రావాలంటే కొబ్బరి ముక్కలను నూనెలో వేయించడం మరియు పచ్చడిని రోటి పచ్చడిలా బరకగా గ్రైండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే తాలింపులో ఇంగువను అస్సలు స్కిప్ చేయద్దు, అదే దీనికి గుడి ప్రసాదం లాంటి కమ్మని వాసనను ఇస్తుంది.

తిరుమలspecial కొబ్బరి పచ్చడి అంటే ఏమిటి మరియు తయారీ పద్ధతి ఎలా ఉంటుంది?
TTD ప్రసాద మెరుగైన రుచి కోసం కొబ్బరి ముక్కలను నూనెలో వేయించడం జరుగుతుంది; పచ్చడి ఇంటి చట్నీలా కాదు. ముక్కలను వేయించి, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి వేయించి Alankarంగా చల్లార్చి, తరిగిన చింతపండు, పసుపు, ఉప్పుతో గ్రైండ్ చేస్తారు; తర్వాత తలింపు వాయించడంతో పూర్తి వర్తనం తయవుతుంది.
తయారీలో ఉపయోగించే ముఖ్య పదార్థాలు ఏమిటి?
పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, ఉప్పు, నూనె, తాలింపు గింజలు (అవాలు, జీలకర్ర), ఇంగువ, కరివేపాకు.
గ్రైండ్ చేయడం ఎలా జరుగుతుంది?
ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, ఉప్పును మిక్సీజార్‌లో బరకంగా పటకట్టుకొని, వెంటనే వేయించిన కొబ్బరి ముక్కలు, నానబెట్టిన చింతపండు, పసుపు కలిపి అవసరమైనంత నీరు చేరుకోవాలని గ్రైండ్ చేయాలి.
తరిఁపట తయారీలో తాలింపు ప్రమాణం ఎలా ఉంటుంది?
చిన్న పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి చేసి అవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేయాలి. ఈ తాలింపు గ్రైండ్ చేసిన పచ్చడికి కలపడం ద్వారా ప్రత్యేక ఘనత వస్తుంది.
అంతిమమైన రుచి కొరకు ఏ చిట్కాలు పాటించాలి?
కొబ్బరి ముక్కలను నూనెలో వేయడం తప్పనిసరి; పచ్చడి కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి; తాలింపులో ఇంగువనుSkip చేయొద్దు, అది ప్రసాదాసం వాసనను పెంచుతుంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+