వంకాయ ఎండురొయ్యల కూర.. ఇలా వండండి, అన్నం మెతుకు కూడా వదలరు నమ్మండి!

వంకాయ ఎండు రొయ్యల కూర. ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో చాలా ఇష్టంగా చేసుకొని తినే కూర వంకాయ ఎండు రొయ్యల కూర. వంకాయ ఎండు రొయ్యల కూర రుచికి మాత్రమే కాదు, వంకాయలోనూ, ఎండు రొయ్యల లోనూ ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ప్రస్తుత మనం వంకాయ ఎండు రొయ్యల కూరను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

వంకాయలు పావు కిలో

ఎండు రొయ్యలు ఒక కప్పు

ఉల్లిపాయ. ఒకటి సన్నగా తరిగినది

టమాట- ఒకటి చిన్న ముక్కలు కట్ చేసినది

పచ్చి మిర్చి - 2

అల్లం, వెల్లుల్లి పేస్ట్- 1 స్పూన్

పసుపు - అర టీ స్పూన్

కారం- 1 స్పూన్

ఉప్పు రుచికి తగినంత

ధనియాల పొడి- 1 స్పూన్

నూనె రెండు టేబుల్ స్పూన్లు

కొత్తిమీర కొద్దిగా

Vankaya Endu Royyalu Kura tastiest Traditional Brinjal And Dried Prawn Curry making process

తయారీ విధానం

ముందుగా ఎండు రొయ్యలను శుభ్రం చేసుకుని నీళ్లలో నానబెట్టి శుభ్రంగా కడిగి గట్టిగా పిండి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి.

ఎండు రొయ్యలు, వంకాయ ఇలా వండితే టేస్ట్

తర్వాత అందులో టమాటా కూడా వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆపైన అందులో ఎండు రొయ్యలు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. ఎండు రొయ్యలు పచ్చిదనం పోయి వేగాయి అని నిర్ధారించుకున్న తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసి మళ్లీ రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి.

అన్నంలో సూపర్ టేస్ట్ ఉండే వంకాయ ఎండు రొయ్యల కూర

వంకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయని నిర్ధారించుకున్న తర్వాత, అందులో ధనియాల పొడి వేసి, కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రుచికరమైన వంకాయ ఎండు రొయ్యల కూర రెడీ అవుతుంది. ఈ కూర అన్నంలో చాలా రుచిగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+