ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు డేంజర్ లో ఉన్నట్లే - నిర్లక్ష్యం చేయద్దు..!!
శరీరంలోని ప్రధాన భాగం కిడ్నీలు. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, పలు ఇతర కారణాల వల్ల కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తుంది. దీంతో అనేక కిడ్నీ సమస్యలు వస్తాయి. కిడ్నీలు డ్యామేజ్ అయితే కొందరిలో లక్షణాలు ఏమీ బయటకు కనిపించవు. కానీ చాలా వరకు వ్యక్తులలో లక్షణాలను ముందుగానే పసిగట్టవచ్చు. ఆ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే తగిన సమయంలో చికిత్స తీసుకుని కిడ్నీలను రక్షించుకోవచ్చు. దీంతో కిడ్నీలకు కలిగే ప్రమాదం తప్పుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కిడ్నీల పనితీరు పైన మనకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సంకేతాల అందుతాయి. వీటిని జాగ్రత్త గా గమనిస్తూ అవసరమైన చికిత్స తీసుకోవటం ద్వారా ముప్పు తప్పించుకోవచ్చు. కిడ్నీలు డ్యామేజ్ అయినప్పుడు లేదా డ్యామేజ్ అవుతున్న సమయంలో మూత్రంలో పలు మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. రాత్రి పూట ఈ అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. మీకు షుగర్ లేకపోయినా తరచూ మూత్రం వస్తుందంటే మీ కిడ్నీల సమస్య ఉందని అనుమానించాలి. మూత్రంలో నురుగు వస్తున్నా జాగ్రత్త పడాలి. మూత్రంలో ప్రోటీన్ ఉంటే ఇలా నురుగు కనిపిస్తుంది. వాస్తవానికి ఇది ప్రమాదకరం. అలాగే కొందరికి మూత్రంలో రక్తం పడుతుంది. దీన్నే హెమటురియా అంటారు. ఇది కూడా ఒక ప్రమాదకరమైన స్థితిగానే భావించాలి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కిడ్నీల సమస్యలు ఉన్న వారి శరీరంలో ద్రవాలు ఎక్కువగా పేరుకుపోతాయి. దీంతో వారి పాదాలు, చేతులు, మడమలు, కాళ్ల భాగాలు వాపులకు గురవుతాయి. కొందరికి ముఖం కూడా ఉబ్బిపోయి కనిపిస్తుంది. కళ్ల కింద కూడా వాపులు కనిపిస్తాయి. కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయని చెప్పేందుకు ఇవి ప్రధానమైన సంకేతాలుగా భావించాలి. కిడ్నీ సమస్య ఉన్నవారికి నీరసం, అలసట ఉంటాయి. చిన్న పనిచేసినా విపరీతంగా అలసిపోతారు. వాతావరణం వెచ్చగా ఉన్నప్ పటికీ చేతులు, పాదాలు మాత్రం చల్లగా ఉంటాయి. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కిడ్నీలు డ్యామేజ్ అయిన లేదా అవుతున్న వారిలో శరీరంలో టాక్సిన్లు అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతాయి. చర్మం తరచూ దురదగా ఉంటుంది. పొడిబారి దురద పెడుతుంది. అలాగే ఆకలి లేకపోవడం, వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం ఇవన్నీ కిడ్నీ డ్యామేజ్‌కు సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. ఈ లక్షణాలు అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవటం ద్వారా కిడ్నీలను కాపాడుకొనే అవకాశం కలుగుతుంది.












Click it and Unblock the Notifications