Hindi Diwas:జాతీయ భాష..జాతీయత నిలబెట్టేది హిందీ : దేశంలో ఏ మూలకెళ్లినా..అనుబంధాలు పెంచే శక్తి..!!
భారతదేశం వివిధ సంస్కృతులకు, విభిన్న భాషలకు, విభిన్నమైన నాగరికతలకు నెలవు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక ప్రాంతీయ భాష ఉంది. అంతేకాదు ఒకే రాష్ట్రంలో కొన్ని గిరిజన ప్రాంతాలకు వెళితే అక్కడి వారి భాష మరొకలా ఉంటుంది. ఆయా వర్గాల వారు మరొకరితో మాట్లాడుకునేందుకే అనుసంధానంగా వ్యవహరించేందే భాష. ఈ భాష ద్వారానే మరొక వ్యక్తికి మనం చెప్పాలనుకునేది చేరుతుంది. ఇక సెప్టెంబర్ 14వ తేదీకి ప్రాధాన్యత ఉంది. ఈరోజు హిందీ దివస్ దినోత్సవంను దేశం జరుపుకుంటోంది.
ప్రపంచ భాషల్లో హిందీ స్థానం ఎంత
హిందీని దేవనగిరి లిపిలో రాస్తాము. ఇందులో చాలా మాండలికాలు కనిపిస్తాయి. వీటిలో బ్రజ్, ఖరీ, బోలీ, బుందేలీ, అవధి, బాఘేలి వంటి మాండలికాలు ఉన్నాయి. మన దేశంలో అత్యధికంగా హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచ భాషల్లో అత్యధికంగా మాట్లాడే భాషలను పరిశీలిస్తే హిందీ నాల్గవ స్థానంలో నిలిచింది. హిందీకి ముందు మొదటి స్థానంలో ఇంగ్లీష్ ఉండగా, రెండవ స్థానంలో స్పానిష్.. మూడవ స్థానంలో మాండరిన్ భాషలు ఉన్నాయి. హిందీ దివాస్ రోజున విద్యార్థులకు ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకు పలు పోటీలు నిర్వహిస్తారు. ఎస్సే రైటింగ్, పోస్టర్ మేకింగ్, క్విజ్, డిబేట్లు లాంటివి నిర్వహించి హిందీ భాష యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పిస్తారు.
హిందీ దివస్ చరిత్ర ఏంటి..?
హిందీ దివస్ ఏటా 14 సెప్టెంబర్‌న దేశం ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజునే దేవనగిరి లిపి నుంచి తీసుకుని భారత అధికారిక భాషగా హిందీని గుర్తించడం జరిగింది. భారత అధికారిక భాషగా హిందీని గుర్తించడంలో ఎనలేని కృషి చేసిన బియోహార్ రాజేంద్ర సింహ పుట్టిన రోజు కూడా సెప్టెంబర్ 14న కావడం విశేషం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశంలోని గుర్తించబడ్డ 22 భాషల్లో హిందీని అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. హిందీ భాషను ఈ రోజున గౌరవించుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా పలు సంస్కృతులకు చెందిన పండగలను కూడా ఈ రోజు పాటిస్తారు. హిందీ సాహిత్యాన్ని ఒక వేడుకలా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14వ తేదీన రాజ్‌భాష కీర్తి పురస్కార్, రాజ్‌భాష గౌరవ్ పురస్కార్ అవార్డులను హిందీ భాష కోసం విశేష కృషిని చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు ప్రదానం చేస్తారు.

హిందీ పదాన్ని తొలుత ఎవరు వాడారు
హిందీ భాషను అధికారిక భాషగా గుర్తించడంలో చాలామంది కవులు రచయితలు కృషి చేశారు. వీరిలో బియోహర్ రాజేంద్ర సింహ, మైథిలి శరణ్, హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కాలేల్కర్, సేత్ గోవింద్ దాస్‌లాంటి ప్రముఖులు ఉన్నారు. హిందీ అనేది ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. పర్షియన్ పదం హింద్ నుంచి హిందీ అనే పదం తీసుకోవడం జరిగింది. 11వ శతాబ్దంలో టర్కీ పాలకులు దేశంపై దండయాత్రకు వచ్చిన సమయంలో హిందీ అనే పదాన్ని వినియోగించారు. అంటే ఇండస్ నది ప్రవహించే నేల అని అర్థం.

జాతీయ అంతర్జాతీయ హిందీ దివస్ మధ్య తేడా..
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 121 భాషలు, 270 మాతృ భాషలు ఉన్నాయి. దేశ జనాభాలో 43.63 శాతం మంది హిందీ మాట్లాడతున్నారు. అంటే 52 కోట్లకు పైగా ప్రజలు హిందీ మాట్లాడుతారని తెలుస్తోంది. జాతీయ హిందీ దినోత్సవంకు అంతర్జాతీయ హిందీ దినోత్సవంకు కొంత తేడా ఉంది. ఈ రెండిటి ఉద్దేశం లేదా లక్ష్యం హిందీని ప్రమోట్ చేయడమే అయినప్పటికీ... రెండిటి చరిత్ర విశిష్టత వేర్వేరుగా ఉంది. జాతీయ హిందీ దినోత్సవం (హిందీ దివస్) సెప్టెంబర్ 14వ తేదీన భారత్‌లో జరుపుకుంటాం. ఇదే రోజున హిందీని భారత అధికారిక భాషగా గుర్తించడం జరిగింది. అంతర్జాతీయ హిందీ దినోత్సవంను జనవరి 10వ తేదీన జరుపుకుంటాం. 1975లో నాగ్‌పూర్‌లో జనవరి 10వ తేదీన తొలి అంతర్జాతీయ హిందీ సమావేశం జరిగింది. ఇందుకు గుర్తుగా అంతర్జాతీయ హిందీ దినోత్సవంను జరుపుకుంటున్నాం.












Click it and Unblock the Notifications