ఆవనూనె ఆరోగ్యానికి మేలా? కీడా?
ఆవనూనె.. మన వంటగదిలో నిత్యం కనిపిస్తుంటుంది. రోజువారీ వంటకాలతో పాటు సాంప్రదాయక మసాజ్‌లకు సైతం వినియోగించే ఓ పెక్యులర్ ఆయిల్ ఇది. పరిమితంగా దీన్ని రోజూ వంటకాల్లో వాడొచ్చు. మిగిలిన వంటనూనెల్లా కాకుండా దీనికి ఉండే సహజ గుణాల మరింత సమర్ధవంతంగా, సమతుల్యంగా శరీరానికి అందాలంటే పరిమితంగానే వాడాలనేది డైటీషియన్ల మాట. ఈ నూనె అందించే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఆవ నూనెలో మోనోఅన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. వీటిని "మంచి కొవ్వులు"గా పరిగణిస్తారు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగనివ్వవు. సమతుల్య ఆహారంలో భాగంగా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు లేదా నొప్పుల వల్ల అసౌకర్యంగా అనిపిస్తే, ఆవ నూనెలోని సహజ యాంటీ బయోటిక్ గుణాలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి.

ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది: ఆవ నూనెలో విటమిన్ ఈ పుష్కలం. ఇది వాయు కాలుష్యం నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. ఇది చర్మం నిగారింపును పెంచుతుంది. పొలుసు, పొడితనాన్ని తగ్గిస్తుంది. సహజ, ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: ఆవ నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలసటగా ఉన్నప్పుడు ఆవనూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల శరీరం తేలికగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఇది శరీరంలో వెచ్చదనం, కండరాల కదలికలను మెరుగుపర్చుతుంది.
జుట్టు కుదుళ్ల బలాన్ని పెంచుతుంది: జుట్టు పొడిగా లేదా బలహీనంగా అనిపిస్తే ఆవ నూనెను అప్లై చేయవచ్చు. తలకు మసాజ్ చేసినప్పుడు ఇది జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
ఆవనూనెలో ఉండే సహజ యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుండీ రక్షణ కల్పిస్తాయి. శ్వాసకోశ ఇబ్బందులను కూడా తగ్గించే గుణం ఆవనూనెకు ఉంది. ఆవ నూనెను ఆవిరి చికిత్సలో భాగంగా ఉపయోగిస్తారు. దాని ఘాటైన వాసన, వెచ్చదనం శ్వాసకోశ మార్గాలను శుభ్రపరచడం, ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియకు తోడ్పడుతుంది: సాంప్రదాయ పద్ధతుల్లో ఆవ నూనె జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందని నమ్ముతారు. ఇది జీర్ణక్రియకు తోడ్పడటం, ఉబ్బరం లేదా బరువు వంటి అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
లిప్ బామ్ ప్రత్యామ్నాయం: కొంతమంది పొడిబారిన లేదా పగిలిన పెదవులకు సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా ఆవ నూనెను పూయవచ్చు. పాదాలకు ఆవ నూనెను రాయడం వల్ల మంచి నిద్ర కలుగుతుంది. జలుబు లేదా ముక్కు దిబ్బడ సమయంలో గోరువెచ్చని ఆవ నూనెను ఛాతీకి, వీపుకు లేదా పాదాలకు రాయడం మంచిదనే అభిప్రాయం ఉంది.
Disclaimer: ఆవనూనె వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేయడమే ఈ కథనం ఉద్దేశం. దీన్ని క్రమం తప్పకుండా వాడాలనుకున్న వాళ్లు ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.












Click it and Unblock the Notifications