గ్యాంగ్ రేప్: నిర్భయ కేసులో ఎప్పుడేం జరిగింది?

ఢిల్లీలో సామూహిక అత్యాచారం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనల క్రమం...
డిసెంబర్ 16, 2012: ఢిల్లీలో కదులుతున్న బస్సులో 23ఏళ్ల ఫిజియోథెరపిస్టుపై సామూహిక అత్యాచారం.
డిసెంబర్ 17: బస్సు డ్రైవర్ రామ్ సింగ్, మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
డిసెంబర్ 18: సంఘటనపై వెల్లువెత్తిన నిరసనలు, సెంట్రల్ ఢిల్లీలో పోలీసులతో నిరసనకారుల ఘర్షణ, నాలుగో నిందితుని అరెస్ట్
డిసెంబర్ 19: ఢిల్లీ కోర్టులో ఇద్దరు నిందితుల హాజరు. తనను ఉరితీయాలంటూ వినయ్ అనే నిందితుడు వేడుకోలు
డిసెంబర్ 21: కేసులో నిందితుడైన మైనర్ బాలుడు పారిపోయే ప్రయత్నం, అరెస్ట్. బీహార్ లో ఆరో నిందితుని పట్టివేత.
డిసెంబర్ 22: సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వద్ద వాంగ్మూలం ఇచ్చిన బాధితురాలు
డిసెంబర్ 23: ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసిన ఢిల్లీ హైకోర్టు
డిసెంబర్ 24: అత్యాచార కేసులో నిందితులను వేగంగా విచారించి, శిక్ష పెంచేందుకు సూచనలిచ్చేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన.
డిసెంబర్ 27: చికిత్స కోసం సింగపూర్‌కు బాధితురాలి తరలింపు
డిసెంబర్ 29: సింగపూర్ ఆస్పత్రిలో బాధితురాలి మరణం.
డిసెంబర్ 30: బాధితురాలి మృతదేహం ఢిల్లీకి తరలింపు, అంత్యక్రియలు
జనవరి 3, 2013: ఐదుగురు నిందితులపై అత్యాచారం, కిడ్నాప్, సాక్ష్యాల విధ్వంసం, హత్యాయత్నం కేసులు నమోదు
జనవరి 28: ఆరుగురు నిందితుల్లో ఒకరు మైనరని తేల్చిన జువైనల్ జస్టిస్ బోర్డు
ఫిబ్రవరి 2: ఐదుగురు నిందితులపై సామూహిక అత్యాచారం, హత్య, ఇతర నేరారోపణల కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు మార్గం సుగమం
ఫిబ్రవరి 3: క్రిమినల్ లా(సవరణ) ఆర్డినెన్స్ విడుదల. మార్చి 19న లోక్ సభలో, 21న రాజ్యసభలో బిల్లు ఆమోదం.
ఫిబ్రవరి 5: కోర్టులో విచారణ ప్రారంభం, నిందితుల వాంగ్మూలం రికార్డు
మార్చి 11: తీహార్ జైల్లోని తన సెల్‌లో ఉరి వేసుకున్న రామ్‌సింగ్
మార్చి 17: సాక్షిగా హాజరైన బాధితురాలి తల్లి, తన కుమార్తెకు న్యాయం చేయాలని వినతి.
జూన్ 14: కస్టడీలో 18ఏళ్లు నిండిన బాల నేరస్థుడు
జులై 11: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పు వాయిదా వేసిన జువైనల్ జస్టిస్ బోర్డు
జులై 25: బాల నేరస్థుడికి శిక్షపై తీర్పును ఆగస్టు 5కు వాయిదా వేసిన జువైనల్ జస్టిస్ బోర్డు
ఆగస్టు 22: తీర్పు వెల్లడించేందుకు జువైనల్ బోర్డుకు సుప్రీం ఆమోదం
ఆగస్టు 31: బాల నేరస్థుడు మూడేళ్లపాటు స్పెషల్ హోంలో గడపాలంటూ ఆదేశించిన జువైనల్ జస్టిస్ బోర్డు
సెప్టెంబర్ 3: తీర్పు వాయిదా వేసిన ఢిల్లీ కోర్టు
సెప్టెంబర్ 10: నిందితులు ముఖేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ అన్ని నేరాల్లోనూ దోషులుగా నిర్ధారణ, బుధవారం తీర్పు వెలువరించనున్న కోర్టు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications