శత్రువులు మిత్రులుగా మారుటకు

మీకు గొడవలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక గొడవతో తలనొప్పి తెస్తోందా.అయితే మీరు ఒక చిన్న పరిహారాన్ని పాటించడం ద్వారా మీకు ఇంట్లో, బయట ఉద్యోగం మరియు వ్యాపారం చేస్తున్నచోట మీకు శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు తొందరలోనే (కొంత సమయం) మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఉన్నది.

ఇలా చేయండి
ఆ పరిహారం విధి ప్రతిరోజూ ఉదయాన్నే 4.30 గం!!ల నుండి 5.30గం!!ల లోపల తల స్నానం చేసి కాలభైరవుడి ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకి " ఓం కాలభైరవాయ నమః " అనేటటువంటి మంత్రంతో 108 సార్లు జపించి అక్షితలతో పూజ చేసిన తరువాత కొద్దిగా అన్నం వండి చల్లారిన పిదప ఆ అన్నాన్ని తీసుకుని ఆ అన్నంలో తెల్ల నువ్వులు వేసి కాలభైరవుడికి నైవేద్యం పెట్టిన పిదప ఆ అన్నాన్ని పక్షులకు వేయండి.

a chance to be friends with someone who is at home

మిత్రుడిగా శత్రువు
అలా వేయడం వలన మీకు ఎక్కడైనా సరే మీరు వెళ్లినటువంటిచోట గొడవలులేక కోర్టు వ్యవహారాలు చికాకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది.ఈ పరిహారాన్ని పాటించడం వల్ల కాలభైరవుడు శత్రువులను నాశనం చేయడు శత్రువులను మిత్రులుగా చేస్తాడు.

కులదైవం ఆరాధన కూడా ...
కాలభైరవారాధనతో పాటుగా మీ కులదేవత ఆరాధన కూడాచేయడం మంచిది.ఈ క్రయతో మీకు వాక్శుద్ధి కలుగుతుంది.మీరు చెప్పేటటువంటి మాట ఎవరైనా సరే చేతులు కట్టుకుని వినే అవకాశం స్వామి కల్పించుతాడు.క్రమం తప్పకుండా జాగ్రత్తగా పాటిస్తే కనుక తప్పని సరిగా మీ శత్రువులు అందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోయేటటువంటి అవకాశం మీకు వస్తుంది.

a chance to be friends with someone who is at home

రాగి యంత్రాధరణ

దీనితో పాటు మూల మంత్రంతో చేయబడిన యంత్రమును ( రాగి రక్షరేకు )మేడలో నల్ల తాడుతో ధరించుట వల్ల పై ప్రయత్నము త్వరగా నెరవేరగలదు.ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటనగా ఇ కాలభైరవస్వామి మంత్రం రోజు చేస్తుంటారు కాబట్టి మీ మాటకు విలువ పెరుగుతుంది కాబట్టి పొరపాటున కుడా నోటితో అమంగళ కరమైన మాటలను మాట్లాడ కూడదు.

ప్రేమను పంచాలి
అందరి తోనూ ప్రేమ పూర్వకంగా మాట్లాడాలి.మీకు అనుకూల స్థితి వచ్చేవరకు చేస్తూనే ఉండాలి.ఇన్ని రోజులు అనే నియమం లేదు.తప్పక ప్రతీ రోజు పశు ,పక్షులకు ఆహారం,త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయాలి.మీ మనస్సు నిలకడగా పెట్టుకుని ,సాధ్యమైనంత పరోపకార తపనతో ఉంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+