వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శతభిషం నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు?

ఏ పాదంలో పుట్టిన శతభిషా నక్షత్ర జాతకులు బంధువర్గానికి ఉపకారం చేస్తారు. గౌరవ మన్ననలు పొందుతారు. శత్రువుల పట్ల శాంతభావం చూపిస్తారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏ పాదంలో పుట్టిన శతభిషా నక్షత్ర జాతకులు బంధువర్గానికి ఉపకారం చేస్తారు. గౌరవ మన్ననలు పొందుతారు. శత్రువుల పట్ల శాంతభావం చూపిస్తారు. వ్యవహార జ్ఞానం ఎక్కువ. నిజాయితీ, సత్యశీల ధర్మచింతన, ధైర్యసాహసాలు, దానగుణం, లౌకిక జ్ఞానం, రసజ్ఞత, వాక్‌చాతుర్యం కనిపిస్తాయి. పుత్రవంతులవుతారు. జీవిత భాగస్వామి పట్ల అభిమానం, ఆసక్తి చూపిస్తారు. ముక్కు, చేతులు పొడువుగా వుంటాయి. దీర్ఘాయుష్కులవుతారు. వాదనలలో సులువుగా వీరిని ఒప్పించలేరు.

మొదటి పాదంలో పుట్టినవారు: గురుడు ఉత్పన్నాంశ - స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్థిరమైన బుద్ధి, నిజాయితీ, పెద్దల పట్ల గౌరవం, వినయం, గోబ్రాహ్మణ పూజాసక్తి, ఉపకారగుణం ఉంటాయి.

రెండవ పాదంలో పుట్టినవారు: శని పాపాంశ - పిరికితనం, స్వార్థ, ముందుజాగ్రత్త, ప్రయోజనచింత, చపలత్వం వుంటాయి.

About ShataBhisam Naksatra Jathakulu

మూడవ పాదంలో పుట్టిన వారు: శని భయాంశ - మందబుద్ధి, నెమ్మది, నిలకడ, స్నేహశీలం, సాహస కార్యాలు నిర్వహించే సమర్థత, స్వార్థం, లౌకిచింత అధికం. పుత్రవంతులవుతారు.

నాలుగవ పాదంలో పుట్టినవారు: గురుసౌమ్యాంశ - శాస్త్రవిజ్ఞానం, పరిశోధన, సాహిత్యం, కళల పట్ల ఆసక్తి, స్నేహ సామరస్యాలు, అభిమానం, మంచితనం, నెమ్మది, దూరదృష్టి, త్యాగశీలం, తాత్త్వికదృక్పథం వుంటాయి.

పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు

ఏ పాదంలోనైనా పుట్టినా వీరికి ఔదార్యం, వినయం, విచక్షణా జ్ఞానం, స్నేహశీలం, దానగుణం, ఉపకార బుద్ధి, ఉన్నతాశయాలు వుంటాయి. గొప్ప పనులు చేస్తారు శాస్త్ర విజ్ఞానం అలవడుతుంది. పుత్రలు ఎక్కువ. పొడవైన శరీరం, పొడవైన నాలుక వుంటాయి. చెవి రగ్ముతలు రావచ్చు

మొదటి పాదంలో పుట్టినవారు: మేష కుజ నవాంశలో జన్మిస్తే ధైర్యసాహసాలు, తొందరపాటు, కార్యారంభ, వైద్య నైపుణ్యం, సుఖ సంపదలు వుంటాయి.

రెండవ పాదంలో పుట్టిన వారు: వృషభ శుక్ర నవాంశలో జన్మిస్తే స్నేహశీలం, కళాభిరుచి, అనుకూల దాంపత్య, వైద్య నైపుణ్యం, సుఖ సంపదలు వుంటాయి.

మూడవ పాదంలో పుట్టినవారు: మిథున బుధ నవాంశలో జన్మిస్తే తండ్రికి ఇష్టులు, ప్రతిభావంతులు అవుతారు. శాస్త్రవేత్తలు, విద్యావంతులై సుఖ సంపదలు అనుభవిస్తారు.

నాలుగవ పాదంలో పుట్టినవారు: కటక చంద్ర నవాంశలో జన్మిస్తే సంపన్నులవుతారు. మాతృభక్తి, జీవిత భాగస్వామ ఇ పట్ల అనురాగం, సంఘంలో గౌరవ మన్ననలు వుంటాయి. పూర్వాభాద్ర 4వ పాదంలో రజస్వల అయిన యువతి సౌభాగ్యవతి అవుతుంది. 1,2,3 పాదాలలో రజస్వల అయితే కుటుంబ సమస్యలు, ఆర్థిక బాధలు వేధిస్యాయి.

English summary
Astrologer explained the faetures of the Shata =Bhisa Naksatra Jatakulu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X