హార్మూజ్ లో చిక్కుకున్న 13 భారత నౌకలు.. కేంద్రం భారీ ఆపరేషన్..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. హార్ముజ్ జలసంధి నుంచి 13 భారత జెండాగల వాణిజ్య నౌకలను సురక్షితంగా తరలించేందుకు భారత్ ఒక ప్రాధాన్య ఆపరేషన్‌ ను ప్రారంభించింది. భారత నావికులను, వాణిజ్య ప్రయోజనాలను కాపాడాలనే లక్ష్యంతో పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) వంటి సంబంధిత సంస్థలు ఈ సమన్వయ ప్రయత్నంలో పాలుపంచుకుంటున్నాయి.

MEA భారత పౌరులను ఇరాన్‌ కు వెళ్లొద్దని సూచించగా.. అక్కడివారు రాయబార కార్యాలయ సహాయంతో తిరిగి రావాలని కోరింది. పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఒపేష్ కుమార్ శర్మ శుక్రవారం మాట్లాడుతూ.. వ్యూహాత్మక జలమార్గంలో ఉన్న భారత నౌకలకు సహాయం చేసేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉందని తెలిపారు. శర్మ ప్రకారం.. ఈ ప్రాంతంలో ఒక LPG ట్యాంకర్, ఐదు ముడి చమురు ట్యాంకర్లు, ఒక రసాయన ట్యాంకర్, మూడు కంటైనర్ షిప్‌లు, రెండు బల్క్ క్యారియర్‌లు, ఒక డ్రెడ్జర్‌ తో సహా 13 భారత జెండాగల నౌకలు ఉన్నాయి. "ప్రస్తుతం లోపల ఉన్న మా నౌకలను బయటకు తీసుకురావడమే మా ప్రథమ ప్రాధాన్యత" అని ఆయన స్పష్టం చేశారు.

మే 25-26 రాత్రి మార్షల్ దీవుల జెండాగల 'నిసోస్ కెరోస్' అనే ముడి చమురు ట్యాంకర్ (2,70,000 మెట్రిక్ టన్నుల చమురుతో) హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్లు శర్మ ధృవీకరించారు. జూన్ 3 న విశాఖపట్నం చేరుకోనున్న ఈ నౌకలో విదేశీ సిబ్బంది మాత్రమే ఉన్నారని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలోని భారత నావికులందరూ సురక్షితంగా ఉన్నారని.. భారత్ లేదా విదేశీ జెండా నౌకలపై ఉన్న భారత సిబ్బందికి ఎటువంటి అవాంతరం లేదని శర్మ తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అత్యవసర నియంత్రణ గది ఇప్పటివరకు 10,800కు పైగా కాల్‌ లను, 24,098కు పైగా మెయిల్స్ ను స్వీకరించింది. గత 96 గంటల్లోనే 500 కాల్స్‌, 1,332 ఈ మెయిల్స్ కు స్పందించింది.

India Launches Priority Maritime Mission to Rescue 13 IndianFlagged Merchant Vessels Trapped Hormuz

గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి 3,422 మంది భారత నావికులను (గత 96 గంటల్లో 47 మందితో సహా) ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగా కొనసాగుతున్నాయని, ఎక్కడా నౌకల రద్దీ లేదని శర్మ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+