102 ఏళ్ల తర్వాత ఈ రాశులు కోటీశ్వరులవుతున్నారు.. కారణం మహాలక్ష్మీ రాజయోగం
సిద్ధాంతులు చెప్పినదాని ప్రకారం ఈ ఏడాది భోగి, సంక్రాంతి, కనుమ పండగలను 14, 15, 16 తేదీల్లో జరుపుకోబోతున్నాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి అవుతుంది. ఈ మకర సంక్రమణం వేళ దాదాపు 102 సంవత్సరాల తర్వాత అరుదైన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోందని పండితులు తెలియజేస్తున్నారు. శుక్రుడు, బుధుడి కలయికతో ఈ యోగం ఏర్పడుతోంది. సంక్రాంతి రోజే ఏకాదశి కూడా ఉంది. దీనివల్ల ఏయే రాశులకు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది, కుబేరులయ్యేవారి వివరాలను తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఎప్పటినుంచో అనుకుంటున్న కోరిక నెరవేరుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా పెళ్లికి సంబంధించి కోరుకున్న యువతితోనే అవుతుంది. పెళ్లయినవారు పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవలు సద్దుమణుగుతాయి. సమాజంలో మంచి పేరున్నవారితో ఈ రాశివారికి పరిచయాలు ఏర్పడతాయి.

మిథున రాశి
ఈ రాశివారు ఆన్ లైన్ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వాటి నుంచి భారీ లాభాలను సంపాదిస్తారు. అంతేకాకుండా వీరు రాజకీయాల్లో రాణించే అవకాశం ఉంది. జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. లాటరీలు తగిలే అవకాశం ఉంది. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవడంతోపాటు, భవిష్యత్తులో రాబడి వచ్చేలా దృష్టి పెట్టి పొదుపు చేయాలి.
కన్యా రాశి
ప్రధానంగా ఈ రాశివారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటే వారికి బాగా కలిసివస్తుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుంది. రాజకీయాల్లో రాణించడానికి మంచి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు వస్తుంది. అంతేకాకుండా పదోన్నతి కూడా ఉంది. ఈ రాశివారు ఈ సమయంలో ఏ పని తలపెట్టినా కలిసివస్తుంది. అదృష్టం వీరి వెంటే ఉంటుంది.












Click it and Unblock the Notifications