Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Astro tips: ఈ పప్పు ధాన్యాలను దానం చేస్తే మీరు ధనవంతులు అవుతారు!!

సనాతన ధర్మంలో దానధర్మాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రాచీన కాలం నుంచి దానధర్మాలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. నేటికీ ప్రజలు తమ ప్రశాంత జీవనం కోసం, తాము కోరుకున్నది నెరవేరడం కోసం, భగవంతుని అనుగ్రహం కోసం, గ్రహదోషాలు తొలగిపోవడం కోసం రకరకాల దానధర్మాలు చేస్తూ ఉన్నారు. దానధర్మాలతో పుణ్యం వస్తుందని సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

అయితే దానధర్మాలు చేయడంలో రకరకాల విధానాలు ఉంటాయి. ఎవరైనా సరే వారి శక్తి మేరకు మాత్రమే దానధర్మాలు చేయాలి. కొన్ని రకాల పప్పు ధాన్యాలను దానం చేయడం వల్ల అదృష్టం మరియు శ్రేయస్సు రెండు వస్తాయి. ఇక దానం చేయవలసిన పప్పు ధాన్యాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Astro tips Donate these pulses and you will become rich details here

మినప్పప్పు
శనివారం రోజు మినపప్పును దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది . శనివారం నాడు ఎవరైతే మినప్పప్పును దానం చేస్తారో అది వారికి శుభాలను తెస్తుంది. మినప్పప్పును దానం చేయడం వల్ల ప్రతికూల శక్తులు దూరమవుతాయి. వ్యాపారంలో వచ్చే అడ్డంకుల నుండి ఉపశమనం పొందుతారు.

శనిదేవునికి అంకితం చేయబడిన శనివారం నాడు నల్లని మినప్పప్పును దానం చేయడం చాలా శ్రేయస్కరం. ఒకవేళ ఎవరైనా ప్రతికూల శక్తులతో ప్రభావితం అవుతుంటే అలాంటివారు మినపప్పులో కొంత భాగాన్ని తీసుకొని దానిని వ్యక్తి చుట్టూ తిప్పి దిష్టి తీసి దక్షిణం వైపు విసిరివేయాలి . ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది.

కందిపప్పు
కందిపప్పు బృహస్పతి స్థానాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. కందిపప్పును దానం చేస్తే గురుదోషం తొలగిపోతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు, ఆటంకాలు ఉన్నట్లయితే బుధవారం నాడు పావురాలకు కందిపప్పును, శనగలను ఆహారంగా వేయాలి. ఇలా చేయడం వల్ల శుభం జరగడంతో పాటు, విష్ణువు యొక్క అనుగ్రహం ఉంటుంది.

మైసూర్ పప్పు
జీవితంలో అంగారకుడు బలహీనంగా ఉంటే, అంగారక దోషం ఉంటే మంగళవారం ఎర్ర పప్పును అంటే మైసూర్ పప్పును దానం చేయాలి. దీనివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి . జాతకంలో అంగారకుడు బలోపేతం అవుతాడు. చేసే పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. సమస్యలు పరిష్కారం అవుతాయి.

పెసరపప్పు
పెసరపప్పును బుధవారం నాడు దానం చేస్తే మంచి జరుగుతుంది. పెసరపప్పును దానం చేయడం వినాయకుడి ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. ఏ పని చేసినా అందులో వచ్చే అడ్డంకులను పెసరపప్పు దానం చేయడం వల్ల పరిష్కరించుకోగలుగుతాము. పెసరపప్పును దానం చేయడం వల్ల ఆర్థిక లాభాలతో ఆశీర్వదించబడతారు. వీరి అదృష్టం ఎప్పుడూ ప్రకాశిస్తుంది. ఇక ప్రతిరోజు పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుడికి పెసరపప్పు సమర్పించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది.

శనగపప్పు
గురువారం నాడు విష్ణుమూర్తి ఆశీర్వాదం కావాలనుకునేవారు శనగపప్పును విష్ణువుకి నైవేద్యంగా పెట్టడంతో పాటు పచ్చిశనగపప్పును లేదా శనగపప్పును దానం చేయాలి. ఇలా దానం చేయడం వల్ల వారి జీవితాల్లో ఉండే సమస్యలు పరిష్కరించబడతాయి. బృహస్పతి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించడంలో శనగపప్పు దానం ఎంతగానో సహాయపడుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+