అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. ఆరు నెలల ముందే చెప్పిన ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ!

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్టు నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. రన్‌వే నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాద ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఆరు నెలల ముందే విమాన ప్రమాదంపై చెప్పిన ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ
ఇలాఉంటే ఈ విమాన ప్రమాద ఘటనపైన ఆరు నెలల ముందే ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన దృశ్యాలు అందరి హృదయాలను కలచివేస్తున్నాయి. అయితే, ఈ ప్రమాదాన్ని 'ఆస్ట్రో శర్మిష్ఠ' అనే యువతి DEC 29, 2024లోనే ట్వీట్ చేశారు. '2025లో ఏవియేషన్ వృద్ధి అద్భుతంగా ఉంటుంది.

Astrologer Sharmishtha predicted a terrible plane crash six months in advance

ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ ట్వీట్ వైరల్
కాకపోతే సేఫ్టీ, సెక్యురిటీ పరంగా ఇబ్బందులుంటాయి. అలాగే, విమానం కూలింది అనే వార్తలు మనల్ని కలచి వేస్తాయి' అని ఆ యువతి 6నెలలకు ముందే అంచనా వేసి చెప్పారు. ప్రస్తుతం ఆ యువతి ట్వీట్లు నెట్టింట వైరల్ గా మారాయి. డిసెంబర్ 29వ తేదీన ఆమె చేసిన ట్వీట్ లో 2025 లో విమానయాన రంగం మెరుగ్గా ఉంటుంది. విమాన ప్రమాదాల ముఖ్యాంశాలు కూడా మనకు షాక్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.

మిథునరాశిలో బృహస్పతి మృగశిర, ఆరుద్రలో ఉన్నప్పుడు భద్రత లోపం
ఇది 6 నెలల క్రితం అంచనా వేయబడింది. విమానయాన రంగంలో ఇప్పటికే కొంచెం మెరుగుదల ప్రారంభమైంది. మిథునరాశిలో ఉన్నప్పుడు మృగశిర మరియు ఆరుద్రలో సుమారు 6.5 డిగ్రీల వేగంతో బృహస్పతి సంచారం చేస్తున్నప్పుడు విమానం అభివృద్ధి చెందుతుంది కానీ భద్రత లోపిస్తుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు ఆస్ట్రాలజర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మృగశిర, ఆరుద్ర నక్షత్రాలలో బృహస్పతి అతిచారి సంచారం ప్రమాదకరం
మృగశిర మరియు ఆరుద్ర నక్షత్రాలలో బృహస్పతి అతిచారి సంచారం చాలా ప్రమాదకరంగా ఉంటుందని ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ అంచనా వేశారు . ఇక తాజాగా ఈరోజు అహ్మదాబాద్ ఘటన జరిగిన తరువాత మరొక పోస్ట్ పెట్టిన జ్యోతిష శాస్త్ర నిపుణురాలు శర్మిష్ఠ ఈరోజు అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం అని పేర్కొన్నారు.

సోషల్ మీడియా లో ఆస్ట్రాలజర్ శర్మిష్ఠ పోస్ట్
బృహస్పతి ఇంకా ఆరుద్రలోకి ప్రవేశించలేదు. అంతేకాదు భారతదేశంలో అంగారక మహాదశ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ఇంకా చాలా ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. తాను అందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాను. దానికి క్షమాపణలు. అంటూ తనను ప్రశ్నలు అడుగుతున్న వారిని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా శర్మిష్ఠ పోస్ట్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+