కార్తీకమాసం విశేషాలు, తెలుసుకోవాల్సిన విషయాలు

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సంవత్సరంలో ఎనిమిదవ నెల అయినటువంటిది కార్తీకంలో శివ కేశవులకు విశేష పూజలు జరుపుతారు. ఆ వాసనకి స్తోత్రపారాయణకే దేవత అనుగ్రహానికి ఈ నెలకు మించిన వంటి అనుకూల సమయం లేదని ప్రాచీనకాలం నుంచి ఉన్న విశ్వాసం.

ఈ నెలలో ప్రత్యేకమైన విషయాలు
స్నానము
దీపము
సూర్యనమ సూర్య నమస్కా
గోవులను పూజించడం
తులసి ఆరాధన
ఉసిరిక దానం
సత్యనారాయణ వ్రతములు
వనభోజనాలు
స్నానం ఎందుకు ?
ప్రతిరోజూ ప్రతి నెలా చేస్తున్న స్నానం కంటే కార్తీకమాసంలో చేసే స్నానాన్ని ఒక విశేషం ఉంది.

ఈ మాసంలో సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేయడం చెబుతారు. ఒకవేళ సోనియా దయ్యం తర్వాత స్నానం చేస్తే అది రోగాలకు కారణమవుతుంది ప్రతీతి.
ఈ మాసానికి కౌముది మాసం అని కూడా మరొక పేరు ఉన్నది, వర్షాలు కురిసిన ప్రభావం ఉండడంచేత వాతావరణం లో జన్మించిన బ్యాక్టీరియా వంటివి తొలగడానికి సమయం పడుతుంది.

పూర్వకాల సంప్రదాయం ప్రకారం సమీపంలో ఉన్న నదికి వెళ్లి పారుతున్న నీళ్లలో స్నానం చేయడం వలన శరీరానికి ఉండే అనేకమైన చర్మరోగాలు తొలగించబడతాయి. అంతేకాకుండా శరీరంలో ఎముకలు మొదలైనవి గట్టిపడతాయి. సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. దానినే కార్తీక స్నానం అని చెప్పారు.

కార్తీక దీపం
ఈ మాసంలో ఉండేటువంటి దీపాలు రెండు రకాలు ఒకటి కార్తీక దీపం, 2 ఆకాశదీపం.
కార్తీక దీపం సాయంకాల సమయంలో భారత వదిలిపెట్టడం లేదా సాయంకాల సమయంలో ఇంటి వాకిట్లో దీపాలతో అలంకారం చేయడం వంటిది.

astrologer tells about karthika masam

కార్తీక దీప లక్షణాలు
కార్తీక దీపంలో గానీ మరే దీపంలోనైనా ఒక వత్తి వేయడం సాంప్రదాయం కాదు. అది మరణానంతరం పార్థివదేహానికి తల భాగంలో పెట్టడం వంటి దీపంలో మాత్రమే వేస్తారు. కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం లేదా మూడు వంతులు కలిపి ఒకటిగా వేయడం విశేషం. దీనికోసం పత్తి, తామర నార, అరటినార వంటి వాటిని వినియోగించడం జరుగుతుంది.
కార్తీకంలో దీపదాననికి విశేషం.
కార్తీకంలో ఒక సారి దీప దానం చేసిన వారికి సంవత్సరం కలుగుతుంది . అందుకని కార్తీకమాసం నెలంతా కూడా దానాలు చేస్తు ఉంటారు.

సూర్య నమస్కారము
ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్ ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలు పారాయణ చేయడం సూర్యనమస్కారాలు చేయడం వంటిది ఆరోగ్యంగా ఉండటానికి అనారోగ్యాన్ని పోగొట్టడానికి సూర్యోపాసన విశేషంగా చెబుతారు. సమంత సూర్య సంబంధించి నమస్కారాలు వేద మంత్రాలలోని అరుణ పారాయణం వంటివి చేయడం జరుగుతుంది.

గోవులను పూజించడం

అన్ని దేవతలకి ప్రతీకయైన టువంటి గోవుని వత్స సహితముగా దూడతో కలిసి పూజిస్తారు. శక్తిలేనివారు లో శక్తి కొలది గోవుకు గ్రాసాన్ని ఇస్తారు. ఆవులను సేవించడం వలన వంశవృద్ధి కూడా జరుగుతుంది.

తులసి ఆరాధన
ఈ మాసంలో విశేషం చదువులకే ఆరాధనకి శాస్త్రీయపరంగా కూడా ఒక ప్రయోజనం ఉందని చెప్పవచ్చు. ఎన్నో ఔషధ మూలికల ప్రయోజనాలున్న భారతీయులు ప్రతి ఇంటిముందు పెట్టుకుని పూజిస్తారు ఉదయ కాలం పూజానంతరం పూజలో మిగిలిన జలాన్ని తులసి చెట్టుకు పోయటం కూడా జరుగుతుంది. దీనివలన జీవంతో ఉంటుంది. తులసి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే వచ్చే ఇటువంటి అనేక రోగ నిరోధక శక్తి ప్రయోజనాలు కూడా చేరుతాయి. కాబట్టి ఈ నెలలో తెలిసి ఆరాధనా తులసీకళ్యాణం కూడా విశేషం.

ఉసిరికాయ నాన్న
సి-విటమిన్ ఎక్కువగా ఉండే ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు మరియు రోగనిరోధక శక్తిని పెంచే వంటిది కూడా ఉంది. ఈ నెలలో ఉసిరికాయలను కూడా దీప సహితంగా దానం చేయడం, మరికొందరు ఉసిరికాయ మీద వట్టి వెలిగించి పెట్టి కలిపి దానమివ్వడం జరుగుతుంది.

సత్యనారాయణవ్రతం
మాఘేవా, మాధవేమాసిం కార్తికేవా శుభేదినే....అని సత్యనారాయణ వ్రత కథ లో మొదటి అధ్యాయం చెప్పడం జరిగింది.
అంటే మాఘ మాసంలో గానీ, చైత్ర మాసంలో గానీ, కార్తీక మాసంలో గానీ ఒక శుభదినమున సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవలెనని చెప్పడం జరిగింది. ఈ మాసంలో సత్యనారాయణ స్వామి ప్రధాని ఆచరించడానికి కారణం కార్తీక దామోదర స్వరూపమైన మాసం.
నారాయణుడు సహస్ర నామములు వ్రతములు మొదలైనవి.అందులో ప్రసిద్ధి చెందినది సత్యనారాయణ వ్రతము. ప్రత్యేకించి ఈ మాసంలో పూర్ణిమ నాడు సత్యనారాయణ వ్రతం ఆచరించడం విశేషం.

వనభోజనాలు
కార్తీక వనభోజనాలు అందరికీ తెలిసినవే కానీ కార్తీక మాసంలోనే చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం.
కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలిసి, స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఉండేటువంటి వనానికి వెళ్లి, అక్కడే వంటలు వండుకొని అందరూ కలిసి భోజనం చేసి సరదాగా గడపడంవల్ల మానసిక ఉల్లాసంతో పాటు ప్రకృతి పరమైన సంరక్షణ జ్ఞానం వంటివి కలుగుతాయి.

అన్ని మాసాల్లోనూ విశేషమైన కార్తీక మాసాన్ని దైవస్వరూపంగా భావించి అందరూ ప్రత్యేక పూజలు దానధర్మాలు చేస్తారు. భారతదేశంలో సంస్కృతికి ప్రతీక దేవతారాధన కూడా ఇందులో చేయడం విశేషం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Astrologer described about karthika masam.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి