ఈ రోజునుండి మార్గశిర మాసము

Posted By:
Subscribe to Oneindia Telugu

వికటకవి ఒకడు మార్గశిర మాసానికి దారితల మాసం అని తెలుగు అర్థం చెప్పాడు. ఇది కోణంగి అనువాద విధానం! ఒకప్పడు సంవత్సరారంభం మార్గశిర మాసంతో అవుతూ ఉండినట్లు కనిపిస్తుంది. ఆ మాసానికి అగ్రహాయణిక అనే పర్యాయనామం ఉన్నట్ల అమరం.

శ్రీకృష్ణ భగవానులు భగవద్గీతలో "మాసానాం మార్గశిరోహం' అని చెప్పి ఉన్నాడు. ఈ వాక్యము ఈ మాసపు ఉత్కృష్టతను చెప్పచున్నది.

Astrology: Margasira masam begins

ఇది సంవత్సరంలో తొమ్మిదో మాసం. ఇది, దీని తరువాత మాసమగు పుష్యము ఈ రెండు మాసములు కలిసి హేమంత ఋతువు. ఈ ఋతువును భాగవత దశమస్కంధంలో వర్ణిస్తూ పోతరాజుగారు "గోపకువూరికలు రేపకడ లేచి, చని, కాళింటి జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యయనీ రూపంబు చేసి . వూసప్రతంబు సలిపిరి." అని కవి మాసవ్రతము అంటున్నాడు.

ఆరోగ్యం కోసమే ఈ వ్రతనిష్ట, వ్రత గ్రంథాలు ఈ మాసంలో మన పూర్వులు జరుపుతుండిన వ్రతాలను పేర్కొంటున్నాయి. వానిని దిజ్మాత్రంగా తెలుసుకుందాము. ఆ తెలుసుకోవడం తిధుల వరుసను అయితే అవగాహనము సులభమవుతుంది.

మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం మార్గశీర్షం కార్తికమాసంలోని నాగులచవితినాడు ప్రవేశించే చలి ఇప్పటికి బాగా ప్రబలుతుంది. మార్గశిర మాసంలో చలి మంటలో పడ్డా పోదని సామెత.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to astrologer Margasira masam begins today (wednsday)
Please Wait while comments are loading...