తులసీ మహిమ: యముడికి పని ఉండదట
ఎవరింటిలో తులసీవనం వుంటుందో ఆ ఇల్లు సర్వతీర్ధస్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్టిస్తారో, వారికి యమధర్మరాజును దర్శించే పని వుండదు.
అనగా, నరకానికి వెళ్లరనీ పుణ్యాత్ములై స్వర్గాన్నే పొందుతారనీ భావము. గంగాస్నానం, నర్మదా దర్శనం, తులసీ సేవనం, ఈ మూడూ సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతూంది. తులసిని ప్రతిష్టించినా, తడిపినా, తాకినా, పెంచినా, మానసిక శారీరకపాపాలేగాక, మాటలవలని పాపాలూ కూడా మటుమాయమై పోతాయి.

తులసి గుత్తులతో శివ, కేశవులను అర్చించినవాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటు వంటి సందేహమూ లేదు. పుష్కరాది తీర్ధాలు నదులు, విష్ణ్వాది దేవతలు తులసి దళాలతో నివసిస్తూంటారు. ఎన్ని పాపాలు చేసినవాడైనాసరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో, అటు వంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు.
అటు వంటి వాడు విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం. ముమ్మాటికీ సత్యం. తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసీవన పితృశ్రాద్ధ చేసినట్లయితే, అది పితరులకు అక్షయ పదాన్నిస్తుంది. అదే-












Click it and Unblock the Notifications