ఇంట్లో ఉత్తర దిశలో బాత్‌రూమ్ ఉందా? అయితే తప్పక తెలుసుకోండి!
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరదిశ కుబేరుడి స్థానంగా చెప్తారు. ఈ దిశ సంపద, కెరీర్, మరియు కొత్త అవకాశాలకు ప్రతిరూపంగా చెప్తారు. అందువల్ల, ఉత్తర దిశలో బాత్‌రూమ్ లేదా టాయిలెట్ ఉండటం పెద్ద వాస్తు దోషంగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఇంట్లోని లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి, ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.ఈ వాస్తు దోషం వల్ల కలిగే నష్టాలు మరియు వాటికి చేయదగ్గ సులభమైన నివారణోపాయాలు తెలుసుకుందాం.
ప్రతికూల ప్రభావాలు:
ఉత్తరంలో బాత్ రూమ్ ఉంటే అనవసరపు ఖర్చులు పెరగడం, చేతిలో డబ్బు నిలవకపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు ఆగిపోవడం లేదా వ్యాపారంలో నష్టాలు రావచ్చు. ఇంట్లో ఉండేవారికి ముఖ్యంగా కిడ్నీలు లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్ధిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతారు.

వాస్తు పరిహారాలు:
ఇల్లు ఇప్పటికే నిర్మించి ఉండి, బాత్‌రూమ్‌ను మార్చడం కుదరకపోతే ఈ క్రింది పరిహారాలు చేయవచ్చు. ఒక నీలిరంగు గాజు గిన్నెలో కల్లుప్పు వేసి బాత్‌రూమ్ మూలలో ఉంచండి. ఈ ఉప్పు అక్కడి ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది. ప్రతి శనివారం ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి.
వీటిని కచ్చితంగా పాటించండి
ఉత్తర దిశలో ఉన్న బాత్‌రూమ్‌కు తెలుపు, లేత నీలం లేదా స్కై బ్లూ రంగు పెయింట్ వేయండి. ముదురు రంగులుముఖ్యంగా నలుపు, ఎరుపు అస్సలు వాడకూడదు. బాత్‌రూమ్‌లో తేమను, నెగెటివ్ ఎనర్జీని దూరం చేసే 'స్పైడర్ ప్లాంట్' లేదా 'మనీ ప్లాంట్' వంటి చిన్న మొక్కలను ఉంచండి. టాయిలెట్ సీట్ చుట్టూ నేలపై అల్యూమినియం లేదా రాగి పట్టీని అమర్చడం ద్వారా దోష తీవ్రతను తగ్గించవచ్చు.
నెగిటివ్ ఎనర్జీని తగ్గించేలా ఈ పరిహారాలు బెస్ట్
బాత్‌రూమ్ తలుపులను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఎల్లప్పుడూ మూసి ఉంచడం వల్ల లోపలి నెగెటివ్ ఎనర్జీ ఇల్లంతా వ్యాపించకుండా ఉంటుంది. బాత్‌రూమ్ బయట, తలుపు పైభాగంలో ఒక చిన్న ఆకుపచ్చ రంగు వాస్తు పిరమిడ్‌ను అమర్చండి. ఇది ఉత్తర దిశలోని బుధ గ్రహ దోషాన్ని తొలగిస్తుంది. బాత్‌రూమ్‌లో ఎల్లప్పుడూ మంచి సువాసన వచ్చేలా ఎయిర్ ఫ్రెషనర్లు లేదా కర్పూరం ఉంచండి. దుర్వాసన ఉంటే నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది.













Click it and Unblock the Notifications