నైరుతిలో టాయిలెట్ ఉందా.. అలెర్ట్!
వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి అనేది భూమి మరియు స్థిరత్వానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఇది పితృ దేవతలు ఉండే దిశ. ఈ దిశకు అధిపతి రాహువు. ఇక్కడ బాత్ రూమ్ లేదా టాయిలెట్ ఉండటం వల్ల తీవ్రమైన వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇదిఇంట్లో ప్రతికూలతలకు కారణం అవుతుంది.
నైరుతిలో బాత్ రూమ్ ఉంటే జరిగే నష్టాలు
నైరుతిలో బాత్ రూమ్ ఉండటం వలన ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోవడం, అనవసర ఖర్చులు పెరగడం జరుగుతుంది.ఆరోగ్య సమస్యలు: కుటుంబ పెద్దకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఎదురవుతాయి.స కుటుంబంలో అశాంతి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం మరియు అపకీర్తి మూటగట్టుకోవాల్సి రావడం జరుగుతుంది.

వాస్తు దోష నివారణోపాయాలు
ఈ దోషాన్ని తొలగించడానికి కొన్ని పరిహారాలు పాటించటం కాస్త వాస్తు దోషాల నుండి విముక్తి కలిగిస్తుంది. బాత్ రూమ్ గోడల చుట్టూ రాగి (Copper) లేదా ఇత్తడి (Brass) లేదా అల్యూమినియం లోహపు పట్టీలను అమర్చటం కాస్త ప్రతికూలతలను తగ్గిస్తుంది. ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు లేదా సముద్రపు ఉప్పు వేసి బాత్ రూమ్‌లో ఏదో ఒక మూలన ఉంచాలి. ఇది ప్రతికూల శక్తిని పీల్చుకుంటుంది.
వాస్తు పిరమిడ్ లు, రంగులతో వాస్తు దోష నివారణ
ప్రతి వారం ఈ ఉప్పును మారుస్తూ ఉండాలి. అప్పుడే ఈ వాస్తు దోష విముక్తి లభిస్తుంది. బాత్ రూమ్ తలుపు పైన లేదా లోపలి సీలింగ్‌కు వాస్తు పిరమిడ్లను అమర్చడం ద్వారా అక్కడ శక్తి సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవచ్చు. అంతేకాదు బాత్ రూమ్ లోపల మరియు బయట గోడలకు లేత పసుపు, క్రీమ్ లేదా ఎరుపు రంగులను వాడాలి. నలుపు, నీలం రంగులను పూర్తిగా నివారించాలి.
నైరుతిలో బాత్ రూమ్ ఉంటే ఆ పని అసలే చెయ్యొద్దు
ఇక బాత్ రూమ్ తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. ఎప్పుడూ మూసే ఉంచాలి., కమోడ్ మూతను కూడా ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. బాత్ రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండేలా చూసుకోవాలి. ఇలా కొన్ని పరిహారాలని పాటిస్తే నైరుతి మూలలో బాత్ రూమ్ ఉండటం వలన కలిగే వాస్తు దోషాల నుండి విముక్తి లభిస్తుంది.













Click it and Unblock the Notifications