వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సృష్టికి మూలం విశ్వకర్మ

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.

విశ్వ మంగళ మాంగళ్య | విశ్వవిద్వా వినోదినే
విశ్వ సంసార భీజాయ | నమస్తే విశ్వకర్మణే
విశ్వాయ విశ్వరూపాయ | నమస్తే విశ్వమూర్తియే
విశ్వమాత పితారూప | విశ్వకర్మ నమోస్తుతే.

సకల ప్రాణికోటిని సృష్టించు జగత్పతి విశ్వకర్మ యొక్క ఆవిర్భావం ఈ సృష్టికి పూర్వమే స్వయంభూవుగా వెలసిన రూపమే విశ్వకర్మ .అసలు విశ్వకర్మలు అంటే ఎవరు. వీరి పూర్వాపరాలు ఏమిటి ? అని పరిశీలిస్తే ! పరమాత్మ విశ్వకర్మ ఐదు ముఖాలతో,పది చేతులతో స్వయంభూగా అవతరించిన రూపం వీరిది.

పుట్టుక,ఆకారం లేకుండా స్వయంభూగా వెలసిన ఈ విశ్వకర్మ భగవానుని పూజ చేయటకొరకు పంచభూతాత్మకమైన ఈ సృష్టికి ఒక ఆకారంగా ఐదు ముఖాలతో రూపాన్ని ఏర్పాటు చేసుకున్నకారణంగా ప్రతి యేట సెప్టెంబర్ 17 వ తేదీన ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ భగవానుని పండగగా విశ్వకర్మీయులు జరుపుకుంటారు.

మహాభారతంలో మయసభను నిర్మించిన దేవశిల్పి అయిన విశ్వకర్మ గురించి అందరికి తెలిసినదే అతడే విశ్వకర్మభగవానుడు అని అనుకుని సృష్టిలో అందరికన్న మొదటి వాడు ఏలా అవుతాడు అని సందేహం వెలుబుచ్చుతారు కొంత మంది.కాని ఈ మహాభారత కాలం నాటి విశ్వకర్మ వేరు,స్వయంభూగా వెలసిన విశ్వకర్మ వేరు. అదేమిటో వేదాల ఆధారంగా చూస్తే మనకు స్పస్టత వస్తుంది.

dhoniWho was Vishwakarma God, Why Vishwakarma Puja is celebrated?

విశ్వకర్మ భగవానుని గురించి ఋగ్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో, శుక్ల యజుర్వేదంలో సృష్టి కర్తగా పేర్కొన బడింది.అథర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడినాడు. పురుష సూక్తంలో విరాట్ పురుషుడుగా కీర్తించ బడినాడు. సహస్ర బాహుగా, సహస్ర చక్షుగా, సహస్ర పాదుడుగా, సహస్ర ముఖుడుగా అన్ని వేదాలలో వర్ణించబడినాడు.సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త.

కాని కొన్ని పురాణాలు చతుర్ముఖ బ్రహ్మను సృష్టికర్తగా వేద విరుద్ధంగా పేర్కొన్నాయి. అంతేగాక విశ్వకర్మను చతుర్ముఖ బ్రహ్మ కుమారుడిగా చెప్తాయి,ఇది వాస్తవం కాదు. వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి.తొలి వేదం నుండి మలి వేద ప్రక్రియ వచ్చే సరికి ఆనాటి కొన్ని సాంఘీక దుష్టశక్తుల వలన స్వయంభూగా వెలసిన విశ్వకర్మ భగవానుని గురించి ప్రత్యేకించి ప్రస్తావన చేయలేదు.

ఆ కారణం చేత సామాన్యులకు అసలు విశ్వకర్మ భగవానుడు ఎవరో తెలియక,అంత అవగాహణ లేకుండా రచనలు,చర్చలు వచ్చాయి.అందుకే మనకు అసలు విషయం ఎమిటో తెలియుట కొరకు కొంత సమాచారాన్ని తెలియజేస్తున్నాను.అన్ని దిక్కులను చూసే దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు అని ఋగ్వేదము ఈయనను భగవంతునిగా పరిగణించింది.మహాభారతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించింది.సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు.వారు విశ్వకర్మకు జన్మించారు.

శ్లో|| నభూమి నజలం చైవ నతేజో నచ వాయవ:
నచబ్రహ్మ నచవిష్ణు నచ రుద్రస్య తారకః
సర్వశూన్య నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ. (మూల స్తంభ పురాణం)

తాత్పర్యం:- భూమి - నీరు - అగ్ని - వాయువు - ఆకాశము, మరియు బ్రహ్మ - విష్ణు - మహేశ్వర - ఇంద్ర -సూర్య - నక్షత్రములు పుట్టక ముందే విశ్వకర్మ తనంతట తాను స్వయంభు రూపమై అవతరించినాడు.ఐదు ముఖాలతో పంచ తత్వాలతో,పంచరంగులతో,పంచకృత్యములతో వెలసిన విశ్వకర్మ దేవుడు విశ్వబ్రాహ్మణులకు కులగురువైనాడు.

శ్లో|| పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః
అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః

తా|| విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతములో సానగ బ్రహ్మర్షి మను బ్రహ్మయు, దక్షిణ ముఖమైన వసుదేవములో సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమ ముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్ట బ్రహ్మయు, ఉత్తర ముఖమైన తత్పురుషములో ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వ ముఖమైన ఈశానములో సువర్ణ మహర్షియను విశ్వజ్ఞ బ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినది.ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి.అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది.

పూర్వం వృత్తి సమాజంలోని ప్రజలకును, ప్రభువులకును తమ విజ్ఞానాన్ని తమదైన శైలిలో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉపయోగపడే కళానైపుణ్యం విశ్వకరీయులది.ప్రాచీన విజ్ఞానానికి నిలువుటద్దం ఈ వృత్తులు. అసలు ఈ సమాజం నడవడానికి వీరి పాత్ర కీలకంగా ఉంటుంది.విశ్వబ్రాహ్మణులు పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా చేస్తారు,ఇది వారి కుల వృత్తులలో భాగం.

జ్యోతిషం,పౌరోహిత్యము చేసే విశ్వబ్రాహ్మణ కులస్థులు కూడా వైదిక బ్రహ్మణులే కనుక పంచ వృత్తులతో పాటు పౌరోహిత్యం కూడా వారి వృత్తియే.పూర్వకాలంలో,రాజ్యానికి శుభములు సమకూర్చేందుకు, పొరుగు దేశరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి,జ్యోతిషులను, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు.వివాహాది షోడశకర్మలు, పూజలు, వ్రతాలు మరియు యజ్ఞయాగాదులు, జరుపడానికి సామన్యప్రజలు జ్యోతిషుని, పురోహితుడునీ తప్పక ఆశ్రయించేవారు.

ఈ విశ్వకర్మల గురించి వేద, పురాణ, ఇతిహాసలో,ప్రాచీన సాహిత్యంలో,ఆధునిక సాహిత్యంలో వీరి గురించి ప్రస్తావించబడినది ఉదహరణకు ప్రజాకవి వేమన తన శతకంలో అంటాడు "విశ్వకర్మలేని విశ్వంబు లేదు" అని మరోక చోట "విశ్వకర్మ దేవాది దేవుడు" అని ప్రస్తావించాడు.ఇదే విధముగా విశ్వకర్మ గురించి నన్నయ,తిక్కన,ఎర్రన,గోనబుద్దారెడ్డి,హూళక్కి భాస్కరుడు,కంకటి పాపరాజు,మారన,పోతన,శ్రీనాధుడు,చేమకూర వేంకటకవి,పుష్పగిరి తిమ్మన,ధూర్జటి,బద్దేన,వేమన,తరిగొండ వెంగమాంబ,మట్ల అనంతరాజు,దొంతిరెడ్డి పట్టాభి రామదాస కవి మొదలగువారెందరో వారి వారి రచనలలో ప్రస్తావించారు.

విశ్వబ్రాహ్మణుల వృత్తుల ద్వార సమాజ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తూ వస్తున్నారు. వీరిని ఈ సమాజంలో ఆచార్య, దైవజ్ఞ ,ఆచారి అనే పేర్లతో పిలుస్తుంటారు.దేవాలయాలలో విగ్రహాలు తయారు చేయువారు విశ్వకర్మలే,వాటిని ప్రతిష్టించుటకు ప్రధానమైన వారు విశ్వకర్మీయులే,అలాగే రధోత్సవంలో విశ్వబ్రాహ్మణుడు లేనిదే దేవకార్యక్రమాలు జరగవు.ఇంతటి ప్రత్యేకతలు కలిగిన వీరు పూర్వం యంత్ర పరికరాలు రాక ముందు పనులన్ని మానవ శ్రమతోనే ముడిపడి ఉండేవి.

లోకంలో మానవ జీవనానికి విశ్వకర్మీయుల కులవృత్తులు ప్రధాన ఆధారంగా ఉండేవి,ఉన్నాయి.ఈ విశ్వకర్మ కులంలో జన్మించిన వాడే శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు ఆది శంకారాచార్యుల వారు, శ్రీమద్వి విరాట్ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఈయన కుల వృత్తులను చేస్తూనే కాలజ్ఞానాన్ని చెప్పాడు.నిష్టాగరిష్టులైన ఈ విశ్వబ్రాహ్మణులు కుల వృత్తులనే కాక జ్యోతిష, పౌరోహిత,యంత్ర,గృహవాస్తు నిర్మాతలుగా,విద్యావేత్తలుగా,వైద్యులుగా, ప్రకృతి వైద్యులుగా,శాసన లేఖకులుగా, ఆర్కిటేక్చర్లుగా,సివిల్ ఇంజనీయర్లుగా,రచయితలుగా,కవులుగా,కవయిత్రులుగా,పత్రికా రంగాలలో,రాజకీయ,సినిమా,టీవి మొదలగు అనేక రంగాలలో నాటి నుండి నేటి వరకు సకల కళల యందు వీరి ప్రావీణ్యతను నిరూపిస్తూ ఈ విశ్వం నందు నిష్ణాతులై విరాజిల్లుతున్నారు.

ఇందులేడు అందుగలడను సందేహంబు వలదు
సకల కళా వల్లభులైన విశ్వకర్మీయులు
ఎందేందు చూసిన అందదే గలరు. జై విశ్వకర్మ

English summary
Vishwakarma Puja, Vishwakarma Diwas or Vishwakarma Jayanti is a unique Hindu festival which is celebrated every year on the 17th of September.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X