గుర్తు పట్టలేని స్థితిలో ఒకప్పటి యాక్షన్ హీరో.. వీడియో వైరల్ !!
ప్రముఖ నటుడు భాను చందర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు Master Venu కుమారుడైన భానుచందర్.. Nireekshana, Sitara వంటి క్లాసిక్ చిత్రాలతో అలరించారు. అలాగే Sutradharulu వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 80, 90వ దశకాల్లో యాక్షన్ హీరోగా అలరించిన ఆయన.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ కావడంతో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఈ వీడియోలో ఆయన పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించడం అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్..
కోనసీమకు చెందిన ప్రముఖ చెఫ్ Chittibabu పెళ్లిరోజు సందర్భంగా భానుచందర్ వీడియో ద్వారా శుభాకాంక్లలు తెలిపారు. ఈ వీడియోలో ఆయన తెల్లబడిన జుట్టు, గడ్డంతో 'సాల్ట్ అండ్ పెప్పర్' లుక్‌లో కనిపించారు. ఒకప్పుడు గ్లామర్ హీరోగా మెరిసిన ఆయనను ఇలా చూడడంతో చాలా మంది అభిమానులు మొదట గుర్తుపట్టలేకపోయామని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చెఫ్ Chittibabu 'గోదావరి రుచులు' బ్రాండ్‌తో ప్రసిద్ధి పొందారు. కోనసీమ ప్రత్యేక వంటకాలైన పనసపట్టు కూర, పులస చేపల పులుసు, ఆవకాయ వంటి వంటకాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుచందర్ లాంటి సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలపడం ఈ బ్రాండ్‌కు మరింత గుర్తింపు తీసుకువచ్చింది.
ఇక హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత కూడా భానుచందర్ వెనుకడుగు వేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. Simhadri, Dubai Seenu వంటి హిట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మరోసారి ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు భానుచందర్ మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించిన వ్యక్తిగా నిలిచారు. 73 ఏళ్ల వయస్సులోనూ ఆయన నిత్యం వ్యాయామం చేస్తూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు. వయస్సు పెరిగినా ఆరోగ్యంపై ఆయన చూపుతున్న శ్రద్ధ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications