బుధుడి ప్రత్యక్ష కదలికతో దశ తిరగనున్న 5 రాశులవారు
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మెర్క్యురీ ప్రస్తుతం మేషరాశిలో ఉంది. ఈనెల 15 నుంచి నేరుగా సంచరించబోతోంది. బుధుడి ప్రత్యక్ష కదలిక కొన్ని రాశులవారికి ఊహించని రీతిలో లాభాన్ని తీసుకురాబోతోంది. ఆ అదృష్ట రాశులేవేంటో తెలుసుకుందాం.
కన్యారాశి : మెర్క్యురీ గమనంలో మార్పు కన్యా రాశి వారికి ఊహించనిరీతిలో లాభసాటిగా మారుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
తుల రాశి : బుధుడి రాశి మార్పు కారణంగా వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. కెరీర్‌లో సక్సెస్ అవుతారు. సంపద రెట్టింపు అవుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. కష్టపడినవారికి వారి శ్రమకు తగినట్లుగా ప్రతిఫలం దొరుకుతుంది.

మిథున రాశి : బుధుడి కదలిక వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆదాయం రెట్టింపై ఆర్థికంగా బలపడతారు. కోరికలన్నీ నెరవేరడంతోపాటు విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చేపట్టే ప్రతి పనిలో అదృష్టం కలిసివస్తుంది.
కర్కాటక రాశి : ప్రతి పనిలో వీరు విజయవంతమవుతారు. కుటుంబం నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. వారితో సంబంధాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. కెరీర్ లో విజయవంతంగా ముందుకు వెళతారు. మీ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభరాశి : మెర్క్యురీ కదలిక వల్ల వీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఆదాయం రెట్టింపవడంతోపాటు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కోరికలన్నీ నెరవేరతాయి.












Click it and Unblock the Notifications