గరుడ పురాణంలో చెప్పిన ఈ 4 పనులు చేస్తే కష్టాలు, కన్నీళ్ళకు స్వస్తి!!

హిందూ మతం యొక్క పురాణాలలో పవిత్రమైన మహా పురాణం గరుడ పురాణం. గరుడ పురాణంలో స్వర్గం-నరకం, జన్మ-పునర్జన్మ, పాపం-పుణ్యం, ఇహలోకం-పరలోకం, మొదలైన వాటిని గురించి చాలా విపులంగా వివరించారు. గరుడ పురాణంలో మొత్తం 271 అధ్యాయాలు 19 వేల శ్లోకాలు ఉన్నాయి. చాలా చోట్ల ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు గరుడ పురాణం చెప్పడం ఆనవాయితీగా ఉంది.

గరుడ పురాణం చదవడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని హిందూమతంలో ప్రగాఢ విశ్వాసం. అటువంటి గరుడ పురాణంలో మన జీవితంలో అనుసరించాల్సిన అనేక ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించారు. గరుడ పురాణంలో చెప్పబడిన ఈ అంశాలను అనుసరించడం ద్వారా కుటుంబానికి సంతోషం శ్రేయస్సు కలుగుతాయి.

Do these 4 things mentioned in Garuda Purana, you will get rid of all the troubles and tears!!

చాలామంది ఇంట్లో పుట్టెడు కష్టాలతో బాధపడుతూ, దుఃఖాన్ని దిగమింగుతూ జీవిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ కష్టాల నుండి,. బాధల నుండి బయటపడాలంటే గరుడ పురాణంలో చెప్పిన కొన్ని విషయాలను పాటించాలి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. గరుడ పురాణం జీవితంలో ఎప్పుడు దుఃఖాన్ని ఎదుర్కోవలసిన అవసరం లేని కొన్ని పనుల గురించి తెలియజేసింది.

వాటిలో ముఖ్యమైనవి గరుడ పురాణం ప్రకారం ప్రతి ఒక్కరు వారి పూర్వీకులను, వారి కుల దైవాన్ని కచ్చితంగా పూజించాలి. పూర్వికులు లేదా కులదైవం కోపంగా ఉంటే వారి జీవితంలో కచ్చితంగా మనశ్శాంతి ఉండదు. వారు ప్రశాంతంగా జీవించలేరు. అందుకే పూర్వీకులను శాంతింప చేయడం కోసం కచ్చితంగా వారిని పూజించాలి.

Do these 4 things mentioned in Garuda Purana, you will get rid of all the troubles and tears!!

గరుడ పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తమ శక్తి మేరకు పేదలకు ఆహారం లేదా ధాన్యాన్ని దానం చేయాలి .దీనివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతే కాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్నం అవుతుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. గరుడ పురాణం ప్రకారం ఇంట్లో చేసే మొదటి రొట్టెను చివరి రొట్టెను కుక్కకు తినిపించాలి.

దీనితోపాటు పక్షులకు, చేపలకు, చీమలకు , ఆహారాన్ని, నీళ్లను ఏర్పాటు చేయాలి. గరుడ పురాణం ప్రకారం గోవుకు కచ్చితంగా సేవ చేయాలి .గోవుకు సేవ చేయడం గొప్ప పుణ్యకార్యం. గో సేవ చేయడం వలన అంతా శుభం జరుగుతుంది. కాబట్టి కచ్చితంగా ఈ నాలుగు పనులను చేస్తే దుఃఖం నుండి కచ్చితంగా బయటపడతారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+