5 రాజయోగాలు.. ఈ రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంది
కొత్త సంత్సరంలో కీలక గ్రహాలన్నీ తమ రాశులను మారుస్తున్నాయి. దీనివల్ల అరుదైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ప్రధానంగా గజకేసరి రాజయోగం, శుక్రాదిత్య, బుధాదిత్య, మాలవ్య రాజయోగాలు ఏర్పడుతుండటంతో కొన్ని రాశులకు ఆర్థిక లాభాలు కలుగుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 5 శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్న పంచ రాజయోగాలు కావడంతో కుబేరులవుతున్న రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
ఒకరకంగా చెప్పాలంటే ఈ రాశివారికి అదృష్టం ఫెవికాల్ లా పట్టుకుంటుంది. విదేశాలకు వెళతారు. జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతి ఉంది. పెండింగ్ సమస్యలు పరిష్కరామవుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. తండ్రి వైపు నుంచి ఆస్తి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలకు వెళతారు. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. రుణాలన్నీ తీర్చేస్తారు.

తులా రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెళ్లి చర్చలు ఫలప్రదమవుతాయి. ఇల్లు కొనాలనే కోరిక నెరవేరబోతోంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు దక్కించుకుంటారు. వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కొత్తవారు మీ వ్యాపారంలో భాగస్వాములుగా చేరతారు.
మిథున రాశి
కష్టమనుకున్న పనిని చాలా సులువుగా పూర్తిచేస్తారు. ఆస్తిని కొనుగోలు చేస్తారు. దీంతోపాటు వాహనాన్ని కూడా కొనుగోలు చేస్తారు. కుటుంబంలో వివాదాలన్నీ పరిష్కారమవుతాయి. భవిష్యత్తు ప్రణాళికలకు పునాది పడుతుంది. ఏ పని తలపెట్టినా విజయం తథ్యం. అదృష్టం మీకు అండగా ఉంటుంది.
మేష రాశి
ఊహించనిరీతిలో ధనలాభం ఉంది. ఇది మీ జీవితాన్ని కీలక మలుపు తిప్పుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. శనిదేవుడి వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చేసే పనిలో విజయాలున్నాయి. సానుకూల మార్పులు కూడా ఉన్నాయి. దేశీయంగా ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
మకర రాశి
పంచ రాజయోగాలు వీరికి బాగా కలిసివస్తాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ముఖ్యంగా తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆస్తి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. స్తబ్దత తొలగిపోతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది. బోనస్ తోపాటు పదోన్నతికి సంబంధించి శుభవార్తను అందుకుంటారు.












Click it and Unblock the Notifications