దసరా నుండి దీపావళి వరకు ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిర్దిష్ట సమయంలో సంచరిస్తాయి. దసరా నవరాత్రుల్లో ముఖ్య గ్రహాల సంచారం అనేక రాశుల వారికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. ముఖ్యంగా శని దేవుడు దసరా నవరాత్రుల్లో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని కలిగించబోతున్నాడు.
దసరా నుండి దీపావళి వరకు శని కటాక్షం
శని కదలికల కారణంగా దసరా నుండి దీపావళి వరకు నాలుగు రాశులవారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. వారి జీవితంలోని అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అక్టోబర్ మూడవ తేదీన శని శతభిషా నక్షత్రంలో ప్రవేశిస్తుంది. శని గ్రహం నవంబర్ 15వతేదీ వరకు శతభిషా నక్షత్రంలో సంచారం చేస్తుంది. దీంతో వచ్చే దీపావళి వరకు కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
శని సంచారం కారణంగా వృషభరాశి వారికి దసరా నుండి దీపావళి వరకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కెరీర్ పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. ఇది వృషభ రాశి వారికి అదృష్ట సమయం.
మిధున రాశి
మిధున రాశి వారికి శని నక్షత్ర సంచారం కారణంగా దసరా నుండి దీపావళి వరకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో అన్ని విధాల ప్రయోజనాలను పొందుతారు.
కుంభరాశి
శని గ్రహ సంచారం కారణంగా కుంభ రాశి వారికి అనేక కష్టాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో వీరికి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. వీరికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమయం కుంభరాశి వారికి నిజంగా అదృష్ట సమయం.
మీనరాశి
మీన రాశి వారికి కూడా శని నక్షత్ర సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మీన రాశి వారికి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగం చేసే వారికి ఇది పురోగమించే సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications