వాస్తు ప్రకారం ఇంటిని శుభ్రం చేయాలి.. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం
ఇంటి నిర్మాణానికి, వస్తువులకు వాస్తును పాటిస్తాం. అలాగే ఇంటిని శుభ్రం చేసే సమయంలో కూడా వాస్తును అనుసరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనవంతులవుతారు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంటి నిర్వహణకు వాస్తులో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కొన్ని నియమాలు, జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రతికూల శక్తిని పారద్రోలి, సానుకూల శక్తిని తెచ్చుకోవాలంటే ఏమేం పాటించాలో తెలుసుకుందాం.
ప్రధాన ద్వారం నుంచి ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించాలి.
ఆ తర్వాత నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలి.
గదులను శుభ్రం చేసుకోవాలంటే సవ్యదిశలో శుభ్రం చేయాలి.

కొందరు రోజుకు 2 సార్లు ఇంటిని తుడుస్తారు.
బ్రహ్మ ముహూర్తంలో తుడుచుకువడం చాలా మంచిది.
దీనివల్ల సానుకూల శక్తి ఇంట్లోకి వస్తుంది.
తెల్లవారుజామున 4.00 గంటల నుంచి 5.30 గంటల మధ్య ఇంటిని తుడుచుకోవాలి.
ఇలా చేయడం చాలా శుభప్రదం.
ఇల్లు తుడిచే సమయంలో కల్లు ఉప్పు లేదంటే నిమ్మరసం కలపాలి.
ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూల శక్తికి ఆహ్వానం పలుకుతుంది.
కుటుంబంలో ప్రశాంతతను కలిగిస్తుంది.
కుటుంబ సభ్యల మధ్య ప్రేమను పెంపొందిస్తుంది.
మధ్యాహ్నం ఇల్లు తుడవకూడదు.
లేదంటే ఉదయం 8.00 గంటల్లోపు తడుచుకోవచ్చు.
ఇంటి సింహద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
దీనివల్ల ఇంట్లో వచ్చే వివాదాలకు నివారణ ఉంటుంది.
కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం కావాలంటే
ఉదయం ఎనిమిది గంటల్లోపే ఇంటిని శుభ్రం చేయాలి.












Click it and Unblock the Notifications