జూన్ లో వీరికి జాక్ పాట్ ఫిక్స్ చేసిన బృహస్పతి!

జ్యోతిష్యశాస్త్రంలో గురు గ్రహ సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దేవగురువుగా కొలవబడే బృహస్పతి స్థానచలనం అనేక రాశుల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కొన్నిసార్లు అనుకూల ఫలితాలను అందిస్తూ, ధనయోగాలను, కెరీర్‌లో ఊహించని పురోగతిని ఇస్తుంది.

జూన్ 2న కర్కాటక రాశిలోకి గురుడు

సాధారణంగా గురువు ఒక రాశిలో సుమారు 12 నెలల పాటు సంచరిస్తాడు. 2026 జూన్ 2వ తేదీన గురు గ్రహం తన స్వక్షేత్రమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్న బృహస్పతి ఈ గోచారంతో తన ఉన్నత స్థానంలోకి మారడం జ్యోతిష్యపరంగా చాలా కీలకంగా చెప్పవచ్చు. ఈ మార్పు కొన్ని రాశులకు అదృష్టాన్ని, అనూహ్య సంపదను తెస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Jupiter Transit 2026 wealth and happiness For Lucky Signs with guru gochar from june

మేష రాశి

మేష రాశి వారికి ఈ గురు సంచారం ద్వారా అపారమైన ధనలాభం, అదృష్టం లభిస్తాయి. వీరు తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న చిన్నచిన్న సమస్యలు సమసిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడి, పాత అప్పుల నుండి విముక్తి పొందుతారు. వ్యాపారంలో అనూహ్య లాభాలు ఆర్జిస్తారు. భాగస్వామ్య భాగస్వామ్య వ్యాపారాలలో సామరస్యం నెలకొంటుంది, సోదరుల మద్దతు లభిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు, విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

కర్కాటక రాశి

గురువు తన స్వక్షేత్రంలోకి ప్రవేశించడం కర్కాటక రాశి ఉద్యోగులకు అత్యంత అనుకూల ఫలితాలను ఇస్తుంది. వారి శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తుంది. కార్యాలయంలో అదనపు బాధ్యతలు, పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగి, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలలో అద్భుతమైన లాభాలు ఆర్జిస్తారు. ఈ కాలంలో వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు గణనీయంగా పెరుగుతాయి.

 7 రాశులవారికి జూన్ 22 వరకు మహారాజయోగం వరమిచ్చిన బుధుడు!
7 రాశులవారికి జూన్ 22 వరకు మహారాజయోగం వరమిచ్చిన బుధుడు!

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారం అత్యంత శుభదాయక ఫలితాలను అందిస్తుంది. గురువు మీ రాశి నుండి భాగ్య స్థానమైన తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తాడు. ఈ స్థానం అదృష్టం, సంపద, ఉన్నత పదవులను సూచిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లభించి, వ్యాపారంలో ఊహించని పురోగతి, లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, సంతానం నుండి శుభవార్తలు వింటారు.

గమనిక: వ్యక్తిగత జాతకం ఆధారంగా ఫలితాలు మారవచ్చు. జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+