• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాఘమాస 'కూడవెళ్ళి' జాతర: ఈ జాతర ప్రత్యేకకత ఏమిటంటే?

|

దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో కూడవెళ్ళి అనే ప్రాంతంలో త్రేతాయుగంలో సీతమ్మ సమేతంగా శ్రీరామచంద్రస్వామి వారి కరకమలాలచే ప్రతిష్టించిన శివలింగం ఇక్కడి ప్రత్యేకత. ఈ ప్రాంతం ఇతి వృత్తం ఏమిటనగా .....

కూడవెళ్ళి అనే పేరు ఎలా వచ్చిందంటే రెండు వాగుల సంఘమ స్థలం (కలిసి ప్రవహించేవి ) ఇక్కడి దేవాలయ వాయువ్య భాగంలో నది ఉత్తరం వాహినిగా ప్రవహిస్తూ వాయువ్యంలో కలుస్తాయి.రెండు వాగులు కలిసి ప్రవహిస్తున్నాయి కాబట్టి కూడవెళ్ళి అనే పేరు వచ్చింది. మాండవ్యనది ప్రాంతంలో వెలసిన గ్రామమే కూడవెళ్ళి అని పేరు.

శివలింగ ప్రతిష్ట చేసిన రాముడు

శివలింగ ప్రతిష్ట చేసిన రాముడు

రాముడికి ఎల్లప్పుడు ఉభయ సంధ్యాలలో స్నానం చేసి శివలింగార్చన చేసే అలవాటు ఉంది. రావణున్ని సంహరించి అయోద్యకు తిరిగి వెళ్లే సమయంలో ఈ ప్రాంతానికి చేరుకుని అక్కడ కొంత సేదతీరి సంధ్యా సమయంలో ఇక్కడ ప్రవహించే ( మాండవ్యనది ) కూడవెళ్ళి వాగులో స్నానం ఆచరించి లంకాదీశ్వరుడు వేదపండితుడైన రావణాసురుని చంపిన బ్రహ్మహత్య మహా పాతకం తనకు తగలకూడదని భావించి దోష నివారణ కొరకు లింగ ప్రతిష్ట చేసి లింగార్చచేయుటకు సంకల్పించాడు కానీ అక్కడ శివాలయాలు లేకపోవడం చేత దోషనివృత్తం కోరకు శివలింగం అవసరం కాబట్టి రాముడికి నమ్మిన బంటైన హనుమంతున్ని కాశీకి వెళ్లి శివలింగం తెమ్మని పంపిస్తాడు.

సైకత లింగం నమూనా తయారు చేసి పూజ

సైకత లింగం నమూనా తయారు చేసి పూజ

హనుమంతుడు రాముని ఆజ్ఞ ప్రకారం వాయువేగంలో కాశీ పట్టణం చేరుకుని సందిగ్దంలో పడతాడు. కాశీ క్షేత్రంలో ఏ వైపు చూసిన శివలింగాలు దర్షణం కావడంతో ఏ లింగం తీసుకు వెళ్లాలి అని ఆలోచిస్తూ ఉండి పోయాడు.ఇంతలో రాముని పూజ కొరకు సంధ్య ఘడియలు ముగిస్తే పూజకు ఫలితం ఉండదు అని భావన చెంది, ఏ కారణం చేత హనుమ రాలేదో అని కాలాన్ని వృధా చేయక రాముడు అక్కడ ఉన్న ఇసుకతో రామేశ్వరంలో ఉన్న ( సైకత ) లింగం నమూన మాదిరిగా తయారు చేసి పూజ ప్రారంభిస్తాడు.

రెండింటికి ప్రాణప్రతిష్ట

రెండింటికి ప్రాణప్రతిష్ట

ఇంతలోనే ఆంజనేయుడు కాశీ క్షేత్రం నుండి లింగాన్ని తీసుకుని వస్తాడు.తన ప్రభునకు సమయానికి లింగాన్ని అందివ్వలేదని ఎంతో ధీనంగా భాదపడుతున్న హనుమంతున్ని చూసి... హనుమా నీవు చింత చెందకు నీవు తెచ్చిన శివలింగం వృధాకాదు నేను తాత్కాలికంగా చేసిన ఈ సైకత లింగం పక్కనే నీవు భక్తితో తెచ్చిన లింగాన్ని ప్రతిష్టిస్తాను అని ఓదారుస్తూ హనుమంతుని చేతిలో ఉన్న లింగాని రాముడు తయారు చేసిన ఇసుక లింగం పానుమట్టంపై పెట్టి ఆ రెండింటికి ప్రాణ ప్రతిష్ట చేసి రాముడు తన పూజ కొనసాగిస్తాడు.నాటి నుండి శ్రీ రామలింగేశ్వర దేవాలయం అనే పేరుగా ప్రసిద్ధి చెందినది.

రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలు

రామలింగేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలు

నాటి నుండి నేటి వరకు ఈ మహాక్షేత్రంలో ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య మొదలుకుని మాఘ శుద్ధ విదియ వరకు అనగా మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడుతున్నాయి.ఈ ప్రత్యేక జాతర ఉత్సవ సమయంలో మహన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం మొదలుకుని అనేక విశేష పూజలు జరుగుతాయి.ఇక్కడ రామలింగేశ్వరస్వామితో పాటు శ్రీ వేణుగోపాలస్వామి,శ్రీ సంఘమేశ్వరస్వామి,వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యస్వామి,శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాలలో కూడ భక్తులు దర్శించి తరిస్తారు.

వంశపారంపర్యంగా అర్చకత్వం

వంశపారంపర్యంగా అర్చకత్వం

ఈ ఆలయాన్ని పూర్వం కాలం నుండి వంశపారంపర్యంగా అర్చకత్వ పూజలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుత ప్రధానార్చకులుగా శ్రీ శ్రీనివాసశర్మ గారు, అర్చకులుగా సంకేత్ శర్మ గారు వైదికపూజలు కొనసాగిస్తున్నారు.ఇక్కడికి ఎందరో మహామహూలు,మహానుభావులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు.ఇటీవలి కాలంలో శ్రీ వీరూపాక్షనంద స్వాముల వారి ఆద్వర్యంలో దేవాలయ మహ సంప్రోక్షణ,కుంభాభిషేకం గావించబడినది.

భక్తి శ్రద్ధలతో పూజించి

భక్తి శ్రద్ధలతో పూజించి

ఈ జాతర పుష్య అమావాస్య ఘడియలు దాటకముందు ప్రదోషకాల సమయంలో రామేశ్వరపల్లి గ్రామశివారులో ఉన్న పులిగుండ్ల అనే ఊరి నుండి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవతో భక్తుల భజనలు,కీర్తనలతో స్వామి వారిని దేవాలయంనకు చేరుస్తారు. అమావాస్య నుండి భక్తులు కూడవెళ్ళి నదీ పుణ్య స్నానాలు ఆచరించి ఇక్కడ శ్రీరాముడు,ఆంజనేయుడు కలిసి ప్రతిష్టించిన ఓకే పానుమట్టంపై రెండు శివలింగాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వారి వారి మొక్కులను చెల్లించుకుంటారు.

 సత్రాలు లేకపోయిన భక్తులు గూడారాలు వేసుకొని ఉంటారు

సత్రాలు లేకపోయిన భక్తులు గూడారాలు వేసుకొని ఉంటారు

అరుదైన రెండు శివలింగాలు ఒకే పానుపట్టంపై ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ మనకు కనిపించదు. ఇది ఇక్కడి ప్రత్యేకత. ఈ మూడు రోజులు భక్తులు ఎక్కడేక్కడి నుండో తండోప తండాలుగా వచ్చి దర్శించుకుంటారు. ఇక్కడ ఉండడానికి ఏలాంటి సత్రాలు లేకపోయిన భక్తులు గూడారాలు వేసుకుని వంటచేసుకుని తిని కొంత మంది రాత్రి నిద్ర చెస్తారు. ఈ జాతరలో వినోదం కోసం ఏర్పాటు చేసిన రంగుల రాట్నాలు,గుర్రపు చక్రాలు,మోటార్ సైకిల్, కార్ల సర్కస్ ఫీట్లను ఇతర అనేక ఆసక్తి కరమైన కాలక్షేప వినోదపు ఆటలను కుటుంబ సభ్యులతో,బందు,మిత్ర పరివారంతో తిలకించి పులకరించి పోతారు.

 ఎక్కడి నుంచి ఎంత దూరం అంటే

ఎక్కడి నుంచి ఎంత దూరం అంటే

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కొలిచిన వారికి కొంగు బంగారం లాగ ఇక్కడి భక్తుల కోరికలను తీరుస్తూ ఉన్నందున దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తమకున్న కోరికలను తీర్చమని వేడుకుంటారు. సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీ సోమవారం నుండి ప్రారంభం అవుతుంది. ఈ పుణ్యక్షేత్రం హైదరాబాద్ నుండి 100 కిలో మీటర్లు, సిద్దిపేట నుండి 30 కిలో మీటర్లు, దుబ్బాక నుండి 10 కిలోమీటర్లు, కామారెడ్డి నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్ర దర్షణం చేసిన వారికి కాశీ,రామేశ్వరం వెల్లిన పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు అంటారు.

--- డా.యం.ఎన్.చార్య, ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This is Kudavelli Rama Lingeshwara Swamy temple is one of the oldest temple in Medak Dist. Every year in Jan-Feb (Maghamasam) a Jathara (Feast) takes place here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more